([సంస్కృతంలో] శుభ్రం = తెలుపు, జ్యోత్స్న = వెన్నల, యామిని = రాత్రి, ద్రుమం = చెట్టు, దళం = కొమ్మ, సస్య = మొక్క)
"శుభ్రజ్యోత్స్న పులకిత యామిని"
తెల్లటి వెన్నెలతో మెరిసే రాత్రి వంటి దానవు ..
"ఫుల్లొ కుసుమిత ద్రుమ దళ శోభిని"
పూలు పూచిన చెట్టు కొమ్మవంటి అందము కలదానవు ..
"సుహాసిని, సుమధుర భాషిణి"
అందమైన నవ్వు కలదానవు, చక్కటి నుడి పలికెడి దానవు ..
"సుఖదాం, వరదాం మాతరం"
సుఖాన్ని వరంగా పొందిన దానవు
"వందేమాతరం"
అమ్మా నీకు మ్రొక్కెద!
"సుజలాం, సుఫలాం, మలయజ సీతలాం, సస్యశ్యామలాం"
మంచి నీరు, పండ్లూ, చల్లటి గాలి, చిక్కటి మొక్కలతో నిండినదానవు,
"వందేమాతరం"
అమ్మా నీకు మ్రొక్కెద!
------------------------
బంకించంద్ర, దుర్గా మాతని ఆరాధిస్తూ రాసుకున్న కావ్యంలోని ఒక ముక్క ఇది. క్రమేపి జాతీయగేయంగా మార్చబడింది.
ఆ మధ్య వాడెవడో తలకి మాసిన దేశభక్తుడు జాతీయగేయం పాడబూని "సునామి బినామీ" అనుకొంటూ ఆముదం గింజలు నమిలి అజీర్తి చేసి కక్కుకుంటున్న అడ్డగాడిదలాగా కూస్తున్న వీడియో చూసాను. కొందరు విరేచనం వచ్చినా దేశభక్తి వచ్చినా ఆపుకోలేరు. వాళ్ళ హావా నడుస్తోందీనాడు. సంస్కృతం విని దాన్ని తెలుగు అనుకోవటం, సంస్కృతం నుండే తెలుగు వచ్చిందని వాళ్ళని వాళ్ళు నమ్మించుకోవటం తెలుగువాళ్ళ పంధా! ఒక్క ముక్క కూడా అర్థం కాట్లేదని మనసుకి తెలుస్తూనే ఉంటుంది, కానీ "ఏమోలే కులంతక్కువ పామర జన్మ, ఎందుకొచ్చింది" అని సరిపెట్టుకుని లెంపలేసుకుంటారు. (వాస్తావనికి బెంగాలీ వాళ్ళని కూడా అక్కడి పండిత వర్గం సంస్కృతమే బెంగాలి భాష మూలం అని నమ్మించింది. పరిశీలించి చూస్తే ఈ జాడ్యం దేశమంతా పాకిపోయింది. దాని గురించి మళ్ళీ చర్చించొచ్చు.) ఈ గేయాన్ని కనీసం ఒకసారైనా అర్థం చేసుకుందామనుకొనే తెలుగు వాళ్ళ కోసం నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని పోగేసి ఇలా తర్జుమ చేసాను. తప్పులుంటే మన్నించండి, అసలు దైవభాషని తెలుగించాలన్న ప్రయత్నమే నేరమనుకుంటే క్షమించండి.