It is amazing how complete is the delusion that beauty is goodness.
- Leo Tolstoy, The Kreutzer Sonata
అందం అంటే
- Leo Tolstoy, The Kreutzer Sonata
అందం అంటే
.. ఒక లెక్క
.. ఒక వరస
.. ఒక పద్ధతి
.. ఒక కూర్పు
.. నిగూఢంగా దాగి ఉన్న ఒక గణిత నియమం
.. అనంతమైన ఈ అస్తవ్యస్తతలో ఒక చిన్న చమత్కారం
.. రొద మధ్యలో ఒక సుస్వరం
.. రొద మధ్యలో ఒక సుస్వరం
అస్థిపంజరం, మాంసం ముద్దలతో తయారైన భౌతిక శరీరం మీద micron మందం గల నశ్వరమైన ఒక అద్భుత మాయా పొర. అమాయక కంటికి మాత్రమే తెలిసేది జ్ఞానానికి అందనిది! విజ్ఞ్యతని అణచి పశుత్వానికి కట్టి పారేసే ఒక మహా మంత్రం. అందం పట్ల కలిగిన ప్రతి వ్యామోహం ఏదోక నాడు నిస్పృహగా గణువు అయ్యేదే, ఈ విషయం బోధపడటానికి ఎంత కాలం-అనుభవం కావాలి? చచ్చినా పర్లేదు.. అందాన్ని తాకగలిగితే చాలు అన్న ఆరాధన-ఆకలి కలగటానికి మనసులో బోల్డంత స్వచ్చత కావాలి. ఆ అమాయకపు ఆవేశం నుంచి పుట్టిన ప్రాణిరాసులమే కదా మన పశు-పక్ష-వృక్షాదులం అంతా..
ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ప్రాణికి ప్రాణి చెప్తూ పంపిస్తున్న రహస్య సందేశం ఒకటే: "అందం కోసం ప్రాకులాడు.. అందం కోసం చుట్టూ వెతుకు, అందం కోసం చస్తూ బ్రతుకు! విశ్వ రహస్యాలని నీకు అందం అన్వయిస్తుంది.. అందం అంటే ఒక లెక్క, ఒక వరస.. విశ్వం గణితం మాట్లాడుతుంది.. వెతుకు harmony వైపు పరిగెత్తు.. అందుకో, సృష్టి ప్రణాళిక నీకు అర్థం అయిన కాకపోయినా నువ్వు అందం వైపుకి పరిగెత్తి పోరాడి ప్రాణశక్తిని హస్తాన్తరితం చెయ్యి.. నీ పని పూర్తి అయినట్టే!"
అందం అంటే
.. ప్రేయసి జుట్టు (blonde, brunette, red..)
.. స్త్రీ కళ్ళు, చెంపల మీదకి విస్తరించిన నూగు జుట్టు
.. చెక్కిలి మృదుత్వం
.. స్త్రీ గొంతు, మెడ, భుజాలు..
.. స్త్రీ యద, నడుము మృదుత్వం, మృదుత్వం, మృదుత్వం..
.. తొడలు, పిరుదలు, మృదుత్వం, ఆశ్చర్యం, మృదుత్వం..
.. సువాసన, పల్ల వరుస, నవ్వు, వెలుతురు! ఆనందం!
.. గాలానికి వేలాడుతున్న ఒక రుచికరమైన ఎర! శ్వాస ఎలానూ శాశ్వతం కాదు కాబట్టి ఎరని చప్పరించి చనిపోతే ఇహ లోకంలో అయినా జన్మకి అర్థం మిగులుతుంది.
అందం నిజమా? - తెలీదు ..
అందం అవసరమా? - తెలీదు..
అందం శాశ్వతమా? - కాదు. కాబట్టే అందం!
మరి హృదయం? - దానికి దీనికి సంబంధం ఏంటి?