అడవి మొత్తం కబురు తిరుగుతుంది, ఇప్పుడే తెలిసింది!
చడ్డి వెస్కొని ఓ పువ్వు పూచింది!
పుట్టీ పుట్టగానే దాని బోసిమొల చూస్కొని ఆ చిన్ని గువ్వ సిగ్గుపడిపోయిందంట ..
గుడ్డు లోపల ఉన్నంత కాలం దానికి ఏ గొడవలేకుండా ఉండిందంట ..
అసలు ఎందుకు బయటకి ఎందుకొచ్చానబ్బా? అని ఆలోచిస్తూ ఉండిపోయిందంట!

అదో.. ఈ మధ్యన 'జంగల్ బుక్' సినిమా రిలీజ్ అవుతుందనే సరికి నా మస్తిష్కంలో జ్ఞాపకాలు వెనక్కి పరిగెత్తాయి. నా గుండు మీద nostalgia చినుకులు ఒకటికి రెంటికి మూడిటికి అనంతం వర్షించి తడిసి ముద్దైపోయాను!
అయితే, మంచో చెడో, కాలంతో పాటు చాల విషయాలు తెలిసినైగా మరి. పాత విషయాలేవి అప్పుడు కనిపించినట్టు ఇప్పుడిక కనిపించవు. ఒక రెండేళ్ళ క్రితమే One piece లాంటి ఆనిమేలు (animés) కనుగొని, చూసి, తరించి, పరవశంతో మూర్చిల్లిపోతిని కాని అప్పటికీ తెలియలేదు నాకు నా బాల్యంలోని అత్యంత సుందర జ్ఞాపకాల్లో ఒకటైన 'జంగల్ బుక్' కూడా ఒక జపనీస్ ఆనిమే నే అని! ప్రతి కళాఖండానికి ఒక విధాత ఉంటాడని, ఈ కళాఖండం దర్శకుని పేరు ఫుమియో కురోకావ ఊహించితినా నేను? టైటిల్స్ లో ఆయన పేరు ప్రతిసారి ఎలా చూడకుండా దాటి వేసాను! జపనీస్ భాషలో 'ల' కి 'ర' కి వ్యత్యాసం ఉండదు. అందుకే ఆ భాషలో దీన్ని జంగురు బుక్కు షోనేన్ మోగురి అని పిలిచారు. ఓహ్ షోనేన్ అంటే ఏమిటనా? అవి జపాన్లో 'బాలురు కోసం' తయారుచేయబడే ఒక తరహ కార్టూన్ల పేరు.. ఇక్కడ షోనేన్ అంటే 'సాహస బాలుడు' అని చెప్పుకోవచ్చు.
అంతేనా? షేర్ఖాన్ కి నేపధ్య స్వరం నానా పటేకర్ అందించాడంట, శీర్షిక గీతాన్ని సాక్షాత్తు గుల్జార్ రచించారంట! ఇవే విషయాలు నాకా రోజు చెప్పుంటే ఏమనే వాన్నో నేను?
ఈ జీవితముందే జీవితము.. అదొక మహా చమత్కార వృత్తాకార చలనము!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి