- మనిషి మాట్లాడాలి.
+ ఆలోచనా అవగాహనా కలిగి ఉండటం వరకు బాగానే ఉంది. అవి వాళ్లకి చెప్పి నువ్వు విముక్తుడవు అవటం ఏమిటి? ఎక్కడో తార్కిక లోపం కనపడుతుంది. హారర్ నవల రాసి ఎవరి నుంచి ఎవరు విముక్తులు అవుతున్నారు?
- క్షమించాలి, మన వాదన కొనసాగించే ముందు కొంత స్పష్టతను స్థాపించటం ముఖ్యం. మన పదజాలంలో కొంత తారతమ్యత ఉంది. నేను చెప్తుంది వాణిజ్య పరమైన లబ్ధిని ఆశించి రాసే "విజయనకి వీలైనన్ని మెట్లు" లాంటి చెత్త రచనా-ప్రసంగాలు చెయ్యాలని కదు. అసలు అది నా దృష్టిలోనే లేదు! నేను చెప్పేది నిజమైన జ్ఞానం పొందిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని రచనల్లో పొందుపరిచి లోకంతో మాట్లాడి తీరాలి అని. తద్వారా లోకానికి మార్గదర్శకులు కాగలుగుతారు.
+ కాబట్టి జ్ఞానవంతుడు మాట్లాడాలి అను, బాగుంటుంది. కాకపోతే ప్రతివాడు జ్ఞానవంతుడనే అనుకుంటాడు కాబట్టి, అవున్లే, ప్రతివాడు మాట్లాడాలి అనటంలో కొంత అర్థం లేకపోలేదు! ఇంతకీ నిజమైన జ్ఞానం అంటే?
- జీవితానికి సంబంధించిన అనేకానేక మర్మాలను, మౌలిక సందేహాలను, సృష్టిలోని అత్యంత మౌలికమైన అంశాలను, మనో-ఆంతరంగిక మౌలిక భావనలను, మున్నగు వాటిని నిశితంగా తటస్థ దృష్టితో పరిశీలన చేయగ మనసుకు స్పురించిన సత్యాలను నిజమైన జ్ఞానం అంటున్నాను.
+ ఒక మాటలో చెప్పాలంటే నీకు నచ్చిన ఒక రకం జ్ఞానాన్ని మౌలికం అని, నిజమైనది అని పిలిచేస్తున్నావు. 'విజయానికి ముప్పై ఆరు మెట్లు' రచయిత మీద నీ వ్యతిరేకత ఏమిటి?
- 'విజయానికి ఇంచక్కా బోలెడు మెట్లు' రచయత మీద నాకు ఏం వ్యతిరేకత లేదు. నా మట్టుకు నేను నా ఆత్మని అలాంటి మాలిన్యం నుంచి రక్షించుకుంటూ ఉంటాను. దుమ్ము మీద, పుప్పొడి మీద నాకు వ్యతిరేకత ఏముంది? నా కంట్లో మాత్రం పడనివ్వను అంతే.
ఇకపోతే సత్యాన్వేషణ అనే ఒక మహా గొప్ప ఆశయాన్ని ఒక వ్యక్తిగత కాలక్షేపంగా చిన్నది చేసి మాట్లాట్టం సబబు అనుకొను. నాకు నచ్చినా, నచ్చకపోయినా 'జీవితం ఏమిటి-ఎందుకు?' అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోటంలోనే మానవ జన్మకి అర్థం ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం కోసమే సమస్థ ప్రాణికోటి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు అధిరోహిస్తూ ఆ సర్వోత్తమ పురోగతి వైపు పరిణామం చెందుతోంది.
+ వినటానికి వినసోంపుగా, ఊహించటానికి గమ్మత్తుగాను, ఆలోచించటానికి అర్థం లేకుండానూ ఉన్నాయ్ నీ మాటలు! నువ్వు చెప్పిన theory లో ఎన్ని అంచనాలు - పూర్వానుమనాలు (assumptions) ఉన్నాయో నీ చేవులికి వినిపిస్తుందా? సత్యం తెలిస్తే గాని ఈ ప్రాణికోటికి విముక్తి లేదు అన్నావు, మనం ఇప్పటికే విముక్తులం అంటాడు utilitarian. వాడి దాడికి తట్టుకోగలదా నీ వాదన? నువ్వు చెప్పేదాన్ని వాదన అని కూడా పరిభాషించలేను. ఒక వాదనలో ఉండాల్సిన పరిపూర్ణత లేనే లేదే?
- చర్చని పక్క దోవ పట్టిస్తున్నాను అనుకోవద్దు. వాస్తవానికి assumptions లేకుండా ఏ జ్ఞానం సాధ్యం కదు. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకుంటున్నాము అన్న భావన మనలో కలగాలి అంటే మనం అంటూ ఒకళ్ళం ఉన్నాము అన్న assumption (అహం-భావన) అందులో అతర్లీనంగా లేకపోలేదు కదా? ఆధునిక భౌతిక శాస్త్రం అయినా, ప్రాచీన అద్వైతం అయినా కొన్ని ప్రతిపాదనల మీద ఆధారపడకుండా ముందుకు సాగలేవు. ఆధారం experimentation నుంచి ఉద్భవిస్తుంది. ఈ రోజుకీ ప్రతి భౌతిక శాస్త్రవేత్తకీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని నమ్మకం కుదరటానికి experimentation తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుకి పరమాత్మ ఉనికిని స్పర్సించాలంటే కళ్ళు ముసుకోడం ఒకటే మార్గం.
మానవుడు ఎటువంటి శ్రమ, intellectual కసరత్తు చేయకుండానే utilitarianగా పుడతాడు. అన్ని తన సుఖం కోసమే నిర్మించబడ్డాయని, ఈ భూమి మీద ఈ శరీరంతో తను చేసే కార్యాలన్నీ అర్థవంతమైనవే అనీ.. ప్రతీ రాబందు, క్రిమి, పంది, కుందేలు, మనిషి, ఆవుదూడ లోకం నుంచి వీలైనంత జుర్రుకుందాం అన్న లక్ష్యంతోనే జీవితం ప్రారంభిస్తారు. కాబట్టి ఒక utilitarianని ప్రశ్నించటం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవటంతో సమానం. మనలోని utilitarian మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడు. ఇక్కడే, ఈ భూమి మీదే, ఈ మట్టి-మశానం శరీరంతోనే నీ జీవితం అని ఇక్కడే కుదేసి కట్టి పారేస్తాడు. నిజమైన జ్ఞానం మనల్ని విముక్తుల్ని చేస్తుంది.
+ మనవ మేధస్సుకి ఎన్ని assumptions సాధ్యం అవుతాయో అన్ని theories పుట్టుకొస్తాయి అన్న అర్థం ఉంది నువ్వు అన్నదాంట్లో. అనట్టు విముక్తి దేని నుంచి?
- మాయ నుంచి. మాయానిర్మితమైన ఈ లోకం నుంచి.
+ మాయ నుంచి విముక్తి కావాలంటే కళ్ళు-నోరు ముసుకోవాలా లేక మాయకి ఉత్తరాలు రాయాలా? అసలు లోకమే మాయ అయినప్పుడు దాని పోకడ-పకోడా వ్యవహారాలతో నీకేం పని? స్వేచ్చని ఆశించటం utilitarian ఆరాటం కాదనగలవా? కమందునికి ఎడతెరిపి లేని వస్తు లాభం నుంచి కలిగే సుఖంలో ఉన్న utilityనీకు విముక్తి కోసం చేసే పోరాటంలో లభిస్తుందేమో అంటాను. కాదనగలవా? సమర్ధించుకుంటావా? సమర్ధించుకోవటం కుడా utilitarian ఆరాటమే అంటాను! ఏం అంటావ్?
- ...
+ సంఘం నుంచి తెగతెంపులు చేసుకుంటేనే గాని సుఖం లేదంటావ్. ఆ లోపే లోకం మాయ అంటున్నావ్. నీ సువార్తలో ప్రశ్న ఉందా - సమాధానం ఉందా? మనిషి మాట్లాడతాడు సరే, వినేవాళ్ళు ఎవరు లేకపోతే మాటేంటి? అయినా మాట్లాడుతూనే ఉంటావా? నీ రచనలు ఎవరు చదవరని తెలిసినా రాసి నదిలో పరేస్తావా? పరేయగల పరిపక్వత ఉందా నీలో?! అది లేనంత వరకు 'విజయానికి ఇంకొక మెట్టు' రచయతకి నీకు ఏ మాత్రం బేధం లేదంటాను. నీ రచనలు అన్ని అల్పమైన ప్రతీకార చర్యలుగా, పిరికితనం చిహ్నాలుగా పరిగనిస్తాను అంటాను. ఏమంటావ్?
+ ఏం? ఎందుకు పాపం?
- సామరస్యం కుదిరేదాకా
+ ఎవరితో?
- లోకంతో
+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- తనని తన మానాన వదలదుగా లోకం.. పేగుబంధం, స్నేహబంధం , తాళిబంధం, రుణ బంధం, కర్మ బంధం, పోలీస్ బంధం! ఒకటా రెండా, పీకకు పెనవేసుకొని ఎన్ని వేర్లు మనిషికి? వాడిని వాడికి ఇష్టం వచ్చిన చేత్తో తిన్నిచ్చారా?
+ ఏం పని? ఎందుకు సామరస్యం?
- అక్కడికే వస్తున్నా. తన స్వేచ్చని హరించే పని మానుకోమని, తనకంటూ చాల లోతైన ఆలోచన - ప్రపంచం పట్ల ఒక్క విలక్షణ దృక్పథం - అవగాహన ఉన్నాయని లోకానికి చెప్పి, మానసికంగా విముక్తుడు అయేంతవరకు మనిషి మాట్లాడుతూనే ఉండాలి .
+ ఆలోచనా అవగాహనా కలిగి ఉండటం వరకు బాగానే ఉంది. అవి వాళ్లకి చెప్పి నువ్వు విముక్తుడవు అవటం ఏమిటి? ఎక్కడో తార్కిక లోపం కనపడుతుంది. హారర్ నవల రాసి ఎవరి నుంచి ఎవరు విముక్తులు అవుతున్నారు?
- క్షమించాలి, మన వాదన కొనసాగించే ముందు కొంత స్పష్టతను స్థాపించటం ముఖ్యం. మన పదజాలంలో కొంత తారతమ్యత ఉంది. నేను చెప్తుంది వాణిజ్య పరమైన లబ్ధిని ఆశించి రాసే "విజయనకి వీలైనన్ని మెట్లు" లాంటి చెత్త రచనా-ప్రసంగాలు చెయ్యాలని కదు. అసలు అది నా దృష్టిలోనే లేదు! నేను చెప్పేది నిజమైన జ్ఞానం పొందిన వ్యక్తులు తమ జ్ఞానాన్ని రచనల్లో పొందుపరిచి లోకంతో మాట్లాడి తీరాలి అని. తద్వారా లోకానికి మార్గదర్శకులు కాగలుగుతారు.
+ కాబట్టి జ్ఞానవంతుడు మాట్లాడాలి అను, బాగుంటుంది. కాకపోతే ప్రతివాడు జ్ఞానవంతుడనే అనుకుంటాడు కాబట్టి, అవున్లే, ప్రతివాడు మాట్లాడాలి అనటంలో కొంత అర్థం లేకపోలేదు! ఇంతకీ నిజమైన జ్ఞానం అంటే?
- జీవితానికి సంబంధించిన అనేకానేక మర్మాలను, మౌలిక సందేహాలను, సృష్టిలోని అత్యంత మౌలికమైన అంశాలను, మనో-ఆంతరంగిక మౌలిక భావనలను, మున్నగు వాటిని నిశితంగా తటస్థ దృష్టితో పరిశీలన చేయగ మనసుకు స్పురించిన సత్యాలను నిజమైన జ్ఞానం అంటున్నాను.
+ ఒక మాటలో చెప్పాలంటే నీకు నచ్చిన ఒక రకం జ్ఞానాన్ని మౌలికం అని, నిజమైనది అని పిలిచేస్తున్నావు. 'విజయానికి ముప్పై ఆరు మెట్లు' రచయిత మీద నీ వ్యతిరేకత ఏమిటి?
- 'విజయానికి ఇంచక్కా బోలెడు మెట్లు' రచయత మీద నాకు ఏం వ్యతిరేకత లేదు. నా మట్టుకు నేను నా ఆత్మని అలాంటి మాలిన్యం నుంచి రక్షించుకుంటూ ఉంటాను. దుమ్ము మీద, పుప్పొడి మీద నాకు వ్యతిరేకత ఏముంది? నా కంట్లో మాత్రం పడనివ్వను అంతే.
ఇకపోతే సత్యాన్వేషణ అనే ఒక మహా గొప్ప ఆశయాన్ని ఒక వ్యక్తిగత కాలక్షేపంగా చిన్నది చేసి మాట్లాట్టం సబబు అనుకొను. నాకు నచ్చినా, నచ్చకపోయినా 'జీవితం ఏమిటి-ఎందుకు?' అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోటంలోనే మానవ జన్మకి అర్థం ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం కోసమే సమస్థ ప్రాణికోటి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు అధిరోహిస్తూ ఆ సర్వోత్తమ పురోగతి వైపు పరిణామం చెందుతోంది.
+ వినటానికి వినసోంపుగా, ఊహించటానికి గమ్మత్తుగాను, ఆలోచించటానికి అర్థం లేకుండానూ ఉన్నాయ్ నీ మాటలు! నువ్వు చెప్పిన theory లో ఎన్ని అంచనాలు - పూర్వానుమనాలు (assumptions) ఉన్నాయో నీ చేవులికి వినిపిస్తుందా? సత్యం తెలిస్తే గాని ఈ ప్రాణికోటికి విముక్తి లేదు అన్నావు, మనం ఇప్పటికే విముక్తులం అంటాడు utilitarian. వాడి దాడికి తట్టుకోగలదా నీ వాదన? నువ్వు చెప్పేదాన్ని వాదన అని కూడా పరిభాషించలేను. ఒక వాదనలో ఉండాల్సిన పరిపూర్ణత లేనే లేదే?
- చర్చని పక్క దోవ పట్టిస్తున్నాను అనుకోవద్దు. వాస్తవానికి assumptions లేకుండా ఏ జ్ఞానం సాధ్యం కదు. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకుంటున్నాము అన్న భావన మనలో కలగాలి అంటే మనం అంటూ ఒకళ్ళం ఉన్నాము అన్న assumption (అహం-భావన) అందులో అతర్లీనంగా లేకపోలేదు కదా? ఆధునిక భౌతిక శాస్త్రం అయినా, ప్రాచీన అద్వైతం అయినా కొన్ని ప్రతిపాదనల మీద ఆధారపడకుండా ముందుకు సాగలేవు. ఆధారం experimentation నుంచి ఉద్భవిస్తుంది. ఈ రోజుకీ ప్రతి భౌతిక శాస్త్రవేత్తకీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని నమ్మకం కుదరటానికి experimentation తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుకి పరమాత్మ ఉనికిని స్పర్సించాలంటే కళ్ళు ముసుకోడం ఒకటే మార్గం.
మానవుడు ఎటువంటి శ్రమ, intellectual కసరత్తు చేయకుండానే utilitarianగా పుడతాడు. అన్ని తన సుఖం కోసమే నిర్మించబడ్డాయని, ఈ భూమి మీద ఈ శరీరంతో తను చేసే కార్యాలన్నీ అర్థవంతమైనవే అనీ.. ప్రతీ రాబందు, క్రిమి, పంది, కుందేలు, మనిషి, ఆవుదూడ లోకం నుంచి వీలైనంత జుర్రుకుందాం అన్న లక్ష్యంతోనే జీవితం ప్రారంభిస్తారు. కాబట్టి ఒక utilitarianని ప్రశ్నించటం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవటంతో సమానం. మనలోని utilitarian మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళడు. ఇక్కడే, ఈ భూమి మీదే, ఈ మట్టి-మశానం శరీరంతోనే నీ జీవితం అని ఇక్కడే కుదేసి కట్టి పారేస్తాడు. నిజమైన జ్ఞానం మనల్ని విముక్తుల్ని చేస్తుంది.
+ మనవ మేధస్సుకి ఎన్ని assumptions సాధ్యం అవుతాయో అన్ని theories పుట్టుకొస్తాయి అన్న అర్థం ఉంది నువ్వు అన్నదాంట్లో. అనట్టు విముక్తి దేని నుంచి?
- మాయ నుంచి. మాయానిర్మితమైన ఈ లోకం నుంచి.
+ మాయ నుంచి విముక్తి కావాలంటే కళ్ళు-నోరు ముసుకోవాలా లేక మాయకి ఉత్తరాలు రాయాలా? అసలు లోకమే మాయ అయినప్పుడు దాని పోకడ-పకోడా వ్యవహారాలతో నీకేం పని? స్వేచ్చని ఆశించటం utilitarian ఆరాటం కాదనగలవా? కమందునికి ఎడతెరిపి లేని వస్తు లాభం నుంచి కలిగే సుఖంలో ఉన్న utilityనీకు విముక్తి కోసం చేసే పోరాటంలో లభిస్తుందేమో అంటాను. కాదనగలవా? సమర్ధించుకుంటావా? సమర్ధించుకోవటం కుడా utilitarian ఆరాటమే అంటాను! ఏం అంటావ్?
- ...
+ సంఘం నుంచి తెగతెంపులు చేసుకుంటేనే గాని సుఖం లేదంటావ్. ఆ లోపే లోకం మాయ అంటున్నావ్. నీ సువార్తలో ప్రశ్న ఉందా - సమాధానం ఉందా? మనిషి మాట్లాడతాడు సరే, వినేవాళ్ళు ఎవరు లేకపోతే మాటేంటి? అయినా మాట్లాడుతూనే ఉంటావా? నీ రచనలు ఎవరు చదవరని తెలిసినా రాసి నదిలో పరేస్తావా? పరేయగల పరిపక్వత ఉందా నీలో?! అది లేనంత వరకు 'విజయానికి ఇంకొక మెట్టు' రచయతకి నీకు ఏ మాత్రం బేధం లేదంటాను. నీ రచనలు అన్ని అల్పమైన ప్రతీకార చర్యలుగా, పిరికితనం చిహ్నాలుగా పరిగనిస్తాను అంటాను. ఏమంటావ్?
- ....
+ మాట్లాడేది అంతా వినేవాళ్ళని ఉద్దేశ్యించినదే కదా? మాయతో మహా శ్రమ పడీ మాటలాడే వాడికి మాయ నుంచి విముక్తి ఉందా?
- మహోత్తమా! మిమ్మల్ని ఇంతకంటే మాటల గారడీ చేసి వంచించలెను! ఒప్పుకుంటాను. సత్యశోధన మీద లక్ష్యం పెట్టినవాడికి అసలు మాట్లాడే పనే లేదు. రాయాల్సిన అవసరమే లేదు. రాసే ప్రక్రియ పూర్తిగా జనాకర్షణ కోసమే! జనాకర్షణ కోసం చేసేపనులు అత్యంత అల్పమైనవి. దానికి మించిన ఆత్మ వంచన ఉందనుకోను. చదవబడదు అని తెలిసి ఎవడైనా ఏ రచనైనా చేస్తాడా? సూన్యంలోకి చూస్తు ఎవడు అరుచుకుంటాడు? దైవంతో మాట్లాడుతున్నాను అని చెప్పేవాడు కూడా Mr.దైవం నుంచి ఎదోక రోజు తిరిగి ఏదోక ఉపయోగపడే సంకేతం వస్తుందనే నమ్మకం తోనే మాట్లాడతాడు.
ఆర్యా! నా కళ్ళు తెరిపించారు.. నా అజ్ఞానం తొలగింది. సత్యశోధన మీద నా చిత్తం-దృష్టి పూర్తిగా నిలిపి అల్పజనమనోరంజకమైన నా ఈ లేకి రచనలు నిలిపివేస్తాను. నా కలం మీద ఒట్టు. ఇక మాట్లాడను! ఒక వేల నా జిహ్వకండూతిని అధిగమించలేక ఇంకొకసారి మాట్లాడానా, నా నీచత్వాన్ని చూసి జ్ఞానం ఎప్పటికి నా దరి చేరదు గాక! దయచేసి నన్ను ఆ విధంగా శపించండి.
Bagundi Bhanu...chala bagundi..
రిప్లయితొలగించండిNaku telusi okanoka samayam lo netho nuvvu vadinchukunnadi, ila marchi raasav anipistundi..
nice
రిప్లయితొలగించండి