13, జూన్ 2014, శుక్రవారం

అనువాదాలు - అపార్థాలు - 1

తెలుగు వాళ్ళకో మాట చెప్పాల్సి ఉంది.
మనమంతా చెవి కోసుకొని వినే అరవ సినిమా అనువాద సంగీత సాహిత్యాన్ని గురించి ..
(నేను చెప్తుంది ఆధునిక అరవ సినిమా పాటలే కాదు.. '80, '90 నాటి రాజా గారి సంగీత సాహిత్యం కూడా కలుపుకొనే మాట్లాడుతున్నాను..)
ఆ అనువాద సాహిత్యమంతా వడపోసాక మిగిలిన టీ పొడి లాంటిది! అది చప్పరించుకొనే.. తెలుగుదేశాన జనాలు పరవశులు అవుతుంటారు. దానికి రెండు-మూడు కారణాలు చెప్పుకో వచ్చు.

1. తెలుగు వాళ్ళది విశాల హృదయం. తేలిగ్గా స్పందించే హృదయం. పవిత్ర పసి శునక¹ హృదయం.
లేదా 
2. సాహిత్యంది ఏముంది తొక్క? వినటానికి బాగుంటే చాలదా?

మొదటిదే నిజమైతే చెప్పటానికి ఏం మిగలదు. నా లాంటి వాళ్ళకి జీవనోపాధే ఉండదు!
రెండో విషయం గురించి చాల ఉంది చెప్పేది!

సమస్య తెలుగులో ఉందో .. తెలుగు యొక్క వారసత్వ సాహిత్య సంప్రదాయంలో ఉందో కచ్చితంగా చెప్పలేను..
కాని సరళమైన అతి సులువైన భాషలో మన చుట్టూ ఉన్న ఆకాశమంత విశ్వ పదార్థాన్ని వర్ణించి కవిత్వాత్మకంగా చెప్పటంలో ఆధునిక తెలుగు సాహిత్యం విఫలమవుతుంది అంటున్నాను. ప్రజలకి అర్థం కాని పదజాలం వాడితే అది ఉన్నతమైన సాహిత్యం అనట్టు ఒక మూస దోరణి ప్రజల్లోకి పాకిపోయింది. విరివిగా సంస్కృత పదాలు ప్రయోగం చేయటం గోప్పన్నట్టు .. 'ఇంత వరకు వినని పదాలు పాటల్లో వినరాదు' అన్న భావన జనాల్లో ఎలానో లా స్థిర పడిపోయిందేమో అనుకుంటాను.

వేటూరి గారు "రావణన్" సినిమా పాటల్ని తెలుగిస్తూ
'కుళ్ళు పుడితే.. కుళ్ళ పొడిచేయి 
వేరుపడితే వేళ్ళు విరిచేయి 
నిన్న వరకు మీది చట్టం నేటి నుంచి మాదే చట్టం.. '
అని ఒక పాట పల్లవిని ప్రారంభించారు. ఆ పల్లవి రెండు పదాలు వినేసరికే మా బంధువు ఒకాయన "ఎవరు బాబు lyricsuu కూని చేస్తున్నాడు!" అనేసారు.





తమిళ మూలంలో కవి-రాజు వైరముత్తు² గారు ఈ పాటని
'కోడు పోట్టాల్ (గీత గీస్తే..) కొన్ను పోడు (చంపి వేసేయి..)
వేలి పోట్టాల్ (కంచె వేస్తే..) వెట్టి పోడు (నరికేసేయి..)
నేత్తు వరైక్కుం ఉంగళ్ చట్టం, ఇనైక్కి ఇరుందు ఎంగళ్ చట్టం..'
అని రాసుకొని గౌరవింపబడ్డారు.

నా ఉద్దేశ్యంలో వేటూరి గారు చేసిన అనువాదం చాల చక్కనైనది. వేటూరి గారు చాదస్తం కొద్ది సరళ (వాడుక) పదాలని ఉపయోగించి మాట పడాల్సి వచ్చింది.
అల కాకుండా ఇదే పాటని
' కక్ష వలపు.. హృదయ జ్వాల..
రక్తపు మడుగు.. నరాల డోల.. 
పాడెను హృదయం విచిత్ర రాగం, పౌరుష తాలం సముద్ర మార్గం!!'
అని ఏ మాత్రం అర్థం పర్థం లేకుండా నోటి కొచ్చిన ప్రాసలు కలుపుకుంటూ బాగా అలవాటున్న బడాయి పదాలు వాడేస్కుంటూ పాట సాగితే తెలుగు వాళ్ళు మైమరిచిపోయి విని ఉండేవారేమో అని  నా అభిప్రాయం! పైపై మెరుగులుకే వసమై పోకుండా భావాల లోతుల్ని ఆస్వాదించే స్థాయి సంగీత అభిమానుల సంఖ్య తెలుగు దేశాన - జన సామాన్యాన చిన్నదావుతుందేమో  అనిపిస్తుంది. వాడుక భాషని సంగీతంలో వాడరు. ఎవరైనా ప్రయత్నిస్తే వెకిలిగా గేలి చేస్తారు. ఒకప్పటి సముద్రాల రాఘవాచార్యులు, శ్రీశ్రీ , ఆత్రేయ, ఆరుద్ర వంటి వారికి భోజనం పెట్టిన వాళ్ళ సంతతేనా ఈ తరం తెలుగు జాతి? అని ఎవరికీ వినపడకుండా నాలో నేను ప్రశ్నించుకుంటుంటాను. బ్రాహ్మణ కులంలో పుడితేనో, లేక కార్పొరేట్-ఇంగిలీసు రాకపోతేనో గాని తెలుగులో ఒక వాక్యం కూడా రాయకుండానే, నాణ్యమైన సాహిత్యం చదవకుండానే .. జీవితం కానిచ్చేయటమే ఈ దుస్థితికి హేతువేమో? సమకాలిన తమిళ సాహిత్య కారుల్లో చాల మంది non-brahminic పరంపర నుంచి వచ్చిన వాళ్ళన్న విషయం గమనార్హం. ఎలా వచ్చి అంటుకుందో తెలియదు కాని.. చెప్పేది బూతైన సంస్కృత శ్లోకంగా చెప్పితే దైవ వాక్కు అనుకోని లెంపలు వేసుకొనే, submissive attitude తెలుగు వాళ్ళ మెదళ్ళకు బాగా పాకిపోయింది అనుకుంటూ ఉంటాను. ఈ తరం కార్పొరేట్ యువతకి ఆ సంస్కృతం స్థానే ఇంగిలీసు వచ్చి దాపరించింది.

సినిమా అనువాదాలు చేసే సదరు తెలుగు రచయితకి ఎదురయ్యే ప్రథాన సమస్య మూతుల మాచింగ్ (lip-sync)!
నిజానికి తమిళ భాషలో మాదిరిగానే వాడుక పదాలు వాడుతూ అనువాదం సాగిస్తే మూతులు సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. (దానికీ పాండిత్యం కావాలి, నేను వాగినంత సులువు కాదు, ఒప్పుకుంటాను.) కాని ఇక్కడే రెండో సమస్య ఆవిర్భవిస్తుంది. అదే ఇందాక చెప్పుకున్న బడాయి పదాల ప్రయోగం. వేటూరి గారు దీన్ని పెద్దగా లెక్క చేయలేదు అనిపిస్తుంది. కాని మిగతా రచయితలు ఈ బడాయి పదాలకోసం - మూతుల కోసం ప్రకులాడి పాట యొక్క భావాన్ని పాపం బొజ్జన పెట్టు కుంటుంటారు.

అవును.. తింటుంది పక్కింటి భోజనమే కాబట్టి వంకలు పెట్టలేము. మరి మనింటి భోజనం గబ్బు కొడుతుంటే ఏం చేసేది? "బడాయి పదాలు ఉంటేనే దేన్నైనా కవిత్వంగా - సంగీత పదార్థంగా పరిగణించాలి" అన్న భావన చాల దురదృష్టకరం. ఇది అనువాద సాహిత్యంలోనే గాక సొంతింటి సాహిత్యంలో కూడా ఘోచారిస్తూనే ఉంటుంది. అయితే తమిళ రచయితలు దీనికి పూర్తి వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తుంటారు. భాషని ఎంత వీలైతే అంత సామాన్యం - సరళికృతం చేసేసి, భావాన్ని, ఆవేశాన్ని ఆకాశానికి ఎత్తగలిగే ప్రక్రియలు అనేకం అరవ సినిమా సంగీత సాహిత్యంలో కనిపిస్తుంటాయి. నాకు తోచిన ప్రతిసారి అలాంటి ఒక గీతాన్ని తెలుగించి పోస్ట్ చేస్తాను.

---------------------------------------------------------------------------------------------------

మచ్చుక్కి కవి 'వాలి' గారు రాసిన "ఉన్నై నినచెన్.." పాటని తెలుగులోకి పదానికి పదం అనువదిస్తున్నాను. దాన్ని తెలుగు సినిమాలోని అనువాదంతో తరువాత విని పోల్చుకోండి.
'అపూర్వ సగోదరగల్' సినిమాలో ఈ పాట ఇతివృత్తం తెలియని వాళ్ళకి టూకీగా: అప్పూ అని పిలువబడే ఒక మరుగోజ్జు  యువకుడు ..ఒక యువతి తనపై చూపిన చనువుని ప్రేమగా అపార్థం చేసుకుంటాడు. కాని ఆ అపార్థం ఎంత అవివేకమైనదో  తనకు తానుగా  తెలుసుకున్న పిమ్మట కలిగిన మనో వ్యధని పాట రూపంలో  వ్యక్తపరుస్తాడు. తన జ్ఞానంతో తాను సంభాషణ చేస్తునట్టుగా పాట కొనసాగుతుంది. 

Pallavi:

Unnai ninaichen paattu padichen, thanggame, nyaana thanggame, 
Ennai ninaichen naanum sirichen, thanggame, nyaana thanggame, 

నిన్ను తలుచుకొని పాట పాడాను, జ్ఞానమా!
నన్ను తలుచుకొని నవ్వుకున్న, జ్ఞానమా!

Antha vaanam azhutha-than, intha bhoomiye sirikkum, 
Vaanampol sila pear, sontha vaazhkaiyum irukkum, 
Unarthaen naan, 

ఆ ఆకాశం ఏడిస్తేనే ఈ భూమి నవ్వుతుంది, 
జీవితంలో కొందరి పాత్ర ఆకాశం లాంటిదై ఉంటుంది!
తెలుసుకున్నాను నేను!

Charanam 1

Aasai vanthu ennai aatti vaitha paavam, 
Matravarai naan yen kutram sole vendum, 
Kottum mazhai kaalam uppu virka poanen, 
Kaatradikkum nearam, maavu vitka poanen, 
Thappu kanakkai pottu thavitthen thanggame, nyaana thanggame, 
Patta piragey bhuthi thelinthen thanggame, nyaana thanggame, 
Nalam purinthai enakku, nandri uraipen unakku, 
Naanthaaan………. 

ఆశ వచ్చి నన్ను కుదిపేసిన పాపానికి,
మిగతా వాళ్ళ మీద ఎందుకు కుట్ర మోపాలి?
వర్షం కురుస్తున్న రోజు ఉప్పు అమ్మాలని చూసాను.. 
గాలి వీస్తున్న సమయం చూసి పిండి అమ్మబోయాను. 
తప్పు లెక్క వేసుకున్నాను జ్ఞానమా.. 
పడిన తరువాత బుద్ధి తెలుసుకున్నాను జ్ఞానమా.. 
మంచిగా అర్థమయావు నాకు, ధన్యుణ్ణి నీకు .. 
నేనే!

Charanam 2

Kan irandil naanthaan, kaathal ennum kottai, 
Katti vaithu paarthen atthanaiyum ottai, 
Ullabadi yoagam, ullavarku naalum, 
Natta vithaiyavum, nallamaram agum, 
Aadum varaikkum aadi iruppom thanggame, nyaana thanggame, 
Aatam mudinthal oattam eduppom thanggame, nyaana thanggame, 
Nalam purinthai enakku, nandri uraipen unakku, 
Naanthaaan………. 

రెండు కళ్ళలో నేనే, ప్రేమ అనే కోటని 
కట్టి పెట్టాను. తీరా చూసాను కదా.. మొత్తం అన్ని కన్నాలే!
అదృష్టం ఉన్న వాళ్ళకే ఎప్పుడూ 
నాటిన విత్తనం, మంచి చెట్టు అవుతుంది.
ఆడే వరకు ఆడుతూ ఉంటాము జ్ఞానమా.. 
ఆట అయిపోయిందా.. ఇంక పరుగులు తీస్తాము జ్ఞానమా,
మంచిగా అర్థమయావు నాకు, ధన్యుణ్ణి నీకు .. 
నేనే!




బాలు స్వరానికి, రాజా సంగీతానికి వసమైపోకుండా వింటే ఈ తెలుగు పాటలో భావం మాతృకతో సంబంధం లేకుండా ఎటెటో వెళ్ళిపోతుంది. పాట ఆద్యంతం clichés తోనే కొనసాగటం గమనిస్తారు. పేలవమైన అనువాదం అయినప్పటికీ (ప్రాసలతో + శ్రమ కలిగించని cliché పదాలతో) వినటానికి  బాగున్న కారణంగా తెలుగు వాళ్ళు మైమరిచిపోతారు.





1: దయచేసి శునకాల పట్ల తక్కువ భావంతో వాక్యాన్ని చదవకండి. 
2: వైరముత్తు గారి గురించి, ఆయన సాహిత్యం పట్ల నాకున్న వ్యామోహం గురించి మరొకసారి తీరుబడిగా చర్చిస్తాను. 

3 కామెంట్‌లు:

  1. నిజమే సంస్కృతంలో పచ్చిబూతులున్నా దాన్ని ఆధ్యాత్మికంగానే చూడవలెను.
    గొప్పవాళ్ళు మనకు అర్ధం కారు అలాగే మరి గొప్పకవిత్వం అనిపించుకోవాలంటే అది మానవమాత్రులకి ఎంత తక్కువ అర్ధమైతే అంతమంచిది. అర్ధమేలేకుంటే ఇక తిరుగులేదు.

    కానీ కవిత్వమంటే సినిమాపాటలేకాదుకదా. అసలు ఎన్ని సినిమాపాటల్లో కవిత్వం ఉంటోందిప్పుడు? వారపత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ రచించబడుతున్న కవిత్వం సరళంగానూ ఆహ్లాదంగానూ ఉంటొందికదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహ!! నిజమే అర్థమే లేకుంటే ఇక తిరుగేలేదు. చరిత్రలో undeciphered claasicగా చిరస్తాయిగా నిలిచిపోతుంది!

      తిలక్, కృష్ణ శాస్త్రి మొన. కవిత్వాలకి వంక అర్హత నాకు లేదు కదండీ.. అందుకే తిట్టటానికి వీలుగా ఉంటుందని సినిమా సాహిత్యాన్ని ఎంచుకున్నాను!
      వాస్తవానికి తమిళులు ఎంత అదృష్టవంతులో, జనసామాన్యం వరకు మంచి సాహిత్యం ఎలా వెళ్లి చేరుతుందో చూసి, కుళ్ళుతో ఉన్నాను నేను.
      ఆ కుళ్ళుని ప్రకటించటమే ఉద్దేశ్యంగా రాసాను. అందుకే కొంత loss of generality కనిపించొచ్చు నా వాదనలో.

      తొలగించండి
  2. ila prati padam tamilam nunchi Telugu ki anuvadinchi na lanti tamilam raani vallaki gnananni penchataniki, vaduka bhasha lo unna Telugu ni sahitya rupam lo asvadinchatam nerchukotaniki chala sahaya padutondi me prayatnam daniki krutagnatalu.. romance language French prabhavam medieval English literature meeda enta prabhavam chupindo alanti prabhavam samskrutam Telugu meeda chupedutondi ani nakanpistundi, manaku samskrutam chala goppa samskrutam lo varnanalu chala impuga anipistayi. dani mundu Telugu motu ga kanapadutundemo manaki. me lanti valla prayatnnam valla mana bhasha loni andanni asvadinche Telugu vari sankhya kachitanga perugutundani na nammakam !:)

    రిప్లయితొలగించండి