21, జూన్ 2014, శనివారం

అనువాదాలు - అపార్థాలు - 3


పాటలు: కవి వైరముత్తు, తిరువయాఱు తియాగరాజ స్వామిగళ్!


తెలుగు వాళ్ళు పరభాషీయుల దగ్గర పరువు నిలబెట్టుకోవాల్సిన సందర్భంలో చివరి అస్త్రంగా ప్రయోగించేది సాగర సంగమం సినిమా గురించి ప్రస్తావించటం. ఆ చిత్రంలో "తకిట తదిమి తకిట తదిమి తందానా" అనే పాట తమకి అర్థమైందని ఎవరైనా తెలుగు వాళ్ళు తేలిగ్గా చెప్పేస్తే నా కళ్ళు వాళ్ళని skepticalగా చూస్తాయి.

... హృదయలయల జతుల గతుల తిల్లాన .. (ఏ తిల్లానాని వర్ణిస్తున్నాడు కవి?)

... ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి 
గుండియలను అందియలుగా చేసి .. (చేసి? ఎవరు  చేసి? చేసి ఏం చేసారు?)

.. పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం 
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురం ... (ఎవరిని 'నువ్వు' అంటున్నాడు? మనుసునా? ..నిజమేనా?)

.. అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ..  (ఉన్నట్టుండి అన్నమాచార్య ప్రస్థావన ఏంటి? యాధృచ్చిక ప్రయోగమా? ఏమైనా కారణం ఉందా?)

నా మట్టుకు నాకు వేటూరి గారు రాసిన పంక్తులు అర్థం చేసుకోవటానికి (పైన పెర్కొన్నటువంటి ప్రశ్నలకి హేతుబద్దమైన సమాధానాలకి రావటానికి) రెండు దశాబ్దల కాలం పైగానే పట్టింది అంటే అబద్ధం లేదు. తెలుగు పాటని తెలుగు వాళ్ళకి అర్థమయ్యే లాగా (ఏ ఇంగ్లీషులోనో) వివరించటంకంటే దురదృష్టం లేదు. ఆ కార్యం నేనైతే తలన పెట్టుకోదలచ లేదు.
అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు కష్టమైనా అర్థం చేసుకుంటారు.  అర్థమైపోయిందని నటించే వాళ్ళకు, సరిపెట్టుకొనే వాళ్ళకు, అసలు అంత అర్థమైపోవాల్సింది ఏముందని తీసిపారేసే వాళ్ళకు నేను చెప్పేదేమీ లేదు.

చిత్రంలోని ఇతివృతాన్ని బట్టి ఈ పాట - ఒక విఫల నాట్యకళాకారుడు మద్యం త్రాగి ప్రేలాపిస్తున్నట్టుగా ఉండాలి, కాని పదాల్లో లోతైన జీవితానుభం ధ్వనించాలి, భావం వైరాగ్యంతో  నిండి ఉండాలి, గట్టి తత్త్వం వినపడాలి - కాని మద్యం త్రాగి ప్రేలాపిస్తున్నట్టుగా ఉండాలి! అలాంటి మహా కఠినమైన సమస్యని ఈ పాట ద్వారా వేటూరి గారు అద్భుతంగా పూరించారు. దాన్ని అరవనాట తమిళ కవి వైరముత్తు గారు దత్తతు తీసుకొని వేరే విధంగా తీర్చి దిద్దారు. ఒకప్పుడు త్యాగరాజులు వారు తెలుగులో గీతాలు ఆలపిస్తే వాటిని అర్థం చేసుకొని మరి తమిళనాట ఆలపించిన రోజులు కలవు. ఈనాడు తెలుగు పాటని తమిళించటం చాల చాల అరుదైన మాటయిపోయింది. తెలుగునాట శక్తివంతమైన సినిమాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చుండుంటే వేటూరి గారివి మరిన్ని పాటలని వైరముత్తు లాంటి వాళ్ళు ఎలా దత్తతు తీసుకొని ఉందురో ముచ్చటగా చూసుండే వాళ్ళం. కాని దురదృష్టం -  అరువు తెచ్చుకున్నంత మోతాదులో అప్పివ్వ లేకపోయాము.

వైరముత్తు గారి చేత అనువదింపబడిన వేటూరి మార్కు తెలుగు పాటని మరల తెలుగించి అందిస్తున్నాను. వేటూరి గారి ఉపమానాల complexityలో పది శాతం కూడా వైరముత్తు గారు అందుకోలేదు (అందుకోవాలనుకోలేదో?). సరళికృతం (simplify) చేస్తూనే మాతృకని గౌరవిస్తూ సందర్భానుసారంగా పాటని నడిపించారు.

పల్లవి:
తకిట తదిమి తకిట తదిమి తందానా 
ఇదయ ఒలియిన్ జతియిల్ ఎనదు తిల్లానా 
ఇరుదయమ్ అడిక్కడి ఇరన్దదు ఎన్బేనా?
ఎన్ కదై ఎళుదిడ మరుక్కుదు ఎన్ పేనా!
* (చురుదియుమ్ లయముమ్ ఓన్-ఱు సేర.. ) *

తకిట తదిమి తకిట తదిమి తందానా 
హృదయం చప్పుడుకి జతగా నా తిల్లాన
గుండె మాటిమాటికి (కొట్టుకున్న ప్రతిసారి కొంత)  చనిపోతుందని చెప్పెదనా?
* (శృతిని లయను ఒకటిగా చేర్చి.. ) *
నా కథ రాయటానికి నిరాకరిస్తోంది నా కలం!

చరణం 1:
ఉలగ వాళ్ క్కై నటనం - నీ ఒప్పుక్కొండ పయనం
అదు ముడియంబోదు తొడంగుం - నీ తొడంగుమ్బోదు ముడియుం

భౌతిక జీవితం ఓ నటనం  - నువ్వు ఒపుకొని ప్రారంభించిన పయనం
అది ముగిసినప్పుడు నువ్వు ప్రారంభం అవుదువు - నువ్వు ప్రారంభం అయినప్పుడు అది ముగియును!

మనిదన్ దినముమ్ అలైయిల్ అలైయుమ్ కుమిళి
తెరియుం తెరిన్దుమ్ మనమే కలంగాదిరు నీ.. 
తాలం ఇంగు తప్పవిల్లై
యార్ మీదుం తప్పు ఇల్లై 
కాల్ గల్ పోన పాదై ఎందన్ ఎల్లై!

మనుషుడు నిత్యం అలలో కదిలేటి బుడగ 
తెలిసి తెలిసి మనసా బాధ పడకు నువ్వు!
ఇక్కడ తాలం ఏమి తప్పలేదు.. 
ఎవరి మీద తప్పు లేదు 
కాళ్ళు ఒకప్పుడు పయనించిన మార్గమే (నా గతమే) నాకు హద్దు!

చరణం 2
పళయ కాలం మరందు - నీ పరందదెన్న పిరిందు?
ఇరవుతోరుం అళుదు - ఎన్ ఇరండుం కన్నుం పళుదు!

(మనసా..)
గడిచిన రోజుల్ని (గతాన్ని) మరువు  - నువ్వు పొందునది ఏంటి విరిగిపోయి?
రాత్రి మొత్తం ఏడ్చి - నా కళ్ళైతే బాగు పడ్డాయి! (ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాయి!)

ఇదు ఒరు రగసియ నాడకమే 
అలైగలిల్ కులున్గిడుం ఓడం నానే!
పావం ఉండు బావం ఇల్లై 
వాళ్ క్కై ఓడు కోబం ఇల్లై 
కాదల్ ఎన్నై కాదలిక్క విల్లై! 

ఇది ఒక రహస్య నాటకమే
అలలు కుదిపిన ఓడను నేనే!
ఆలోచనలో పాపం ఏది లేదు.. 
జీవితం నన్ను కోపగించుకోలేదు.. 
ప్రేమ నన్ను ప్రేమించలేదు!

7 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అలా అంటారా?
      ఎలా ఏర్పడిందో మరి అభిప్రాయం కాని.. చాల మంది నేను చెప్పేది వినటానికి ముందే defensive mode లోకి వెళ్ళిపోయి చదవటం ఆరంభిస్తున్నారానిపిస్తుంది! Hypocrisyని తాకితే ప్రాణం జివ్వుమానేస్తుంది ఎవరికైనా.

      తొలగించండి
  2. 1. .>>అరువు తెచ్చుకున్నంత మోతాదులో అప్పివ్వలేకపోయాము... << true..
    2. వేటూరి గారి ఉపమానాల కాంప్లెక్సిటీ అందుకోవడం.. కుదిరిఉండదేమో కూడా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముమ్మాటికి. వేటూరి స్థాయిని అందుకోవటం వైరముత్తు తరం కాదు.
      కాని వైరముత్తు రకం కవిత్వం తెలుగులో రాయబదకపోవటం కాస్త దురదృష్టం.
      ఒకసారి వీలయితే గొల్లపూడి మారుతీరావు గారు రాసిన ఈ వ్యాసం చదవ గలరు.

      http://www.koumudi.net/gollapudi/053110_veturi.html

      తొలగించండి
    2. గొల్లపూడి గారు "అభిరుచి దారిద్ర్యం ఈ ప్రభుత్వాలది. ఈ విషయంలో మనవాళ్ళు పొరుగు తమిళనాడు, కేరళ, బెంగాలుని చూసి ఎంతయినా నేర్చుకోవలసి ఉంది" అంటారు. ఎప్పుడూ తెలుగు భాష ఉద్ధరణ గురించి ఒక మాట కూడా మాట్లాడని వాళ్ళకి కూడా ఈ మాట ఒప్పుకోటానికి పనికిరాని పౌరుషం తన్నుకొస్తుంది.

      ప్రభుత్వాలే జనాలు జనాలే ప్రభుత్వాలు - కాని జనాలు ప్రభుత్వాలని, ప్రభుత్వాలు జనాలని తప్పు పడతాయి.

      తొలగించండి