ఏమన్నావు..? ప్రేయసి నవ్వు మీద కవిత్వం రాద్దునా?
పదాలు నువ్విస్తావా మరి?
ఎలాంటి పదాలు కావాల్న? సరే చెప్తాను విను -
- symmetry, simplicity, complexity: అన్నిటినీ కలిపి ఒకే పదంలో ఇమిడ్చి ఇయ్యగలవా?
- beauty, beauty, beauty, beauty, beauty: ఒకే పదంలో అన్ని సార్లు 'అందం' ప్రతిధ్వనించి వినిపించాలి. అలాంటివి వెవ్వేరు పదాలు ఒక అరడజను.
- అంతం + ఆరంభం: రెండు అర్థాలు ఒకేసారి ఉండే పదాలు ఒక రెండు.
- నెలవంకనీ చుక్కనీ కలిపి ఏమంటారు? ఒకే పదంలో చెప్పాలి! అదొక పదం కావాలి. వీలైతే ఓ పర్యాయపదం.
- 'కరడుకట్టిన కారుణ్యం' - వినటానికి ఎలా ఉంది? అలాంటి పదం ఒకటి.
- బలమైన తుమ్ము తర్వాత కళ్ళలో ఉండే ప్రశాంతత ఉంటుందే? దాన్ని కవిత్వంలో ఇమిడిపోయే లాంటి అందమైన పదంగా మార్చి కావాలి.
- ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, నిలువుగా, తలక్రిందులుగా - ఎలా చుసిన ఒకే అందం ఇచ్చే చమత్కారం పదాలు ఓ 888 కావాలోయి!
- చిన్నప్పుడు గుర్తుందా? చీకట్లో వర్షం పడుతుంటే ఒక పెద్ద మెరుపు వచ్చేది .. ఉన్నట్టుండి అంతవరకు చీకట్లో ఉన్న ప్రపంచం క్షణం పాటు పగలు లాగ కనిపించేది? అప్పుడు మనసులో కలిగిందాన్ని ఏమని వర్ణించాలి? భయమా? ఆశ్చర్యమా? ఏదో అందం అర్థమైందన్న సంబరమా? అలాంటి భావనల్ని వర్ణించే పదం కలదా?
- నీటి అడుగున ఊపిరి బిగబట్టి, ఒక నిమిషం వరకు అలానే బిగబట్టి, ఇంకొక నిమిషం కుడా బిగపట్టి, మూడో నిమిషం కూడా బిగబట్ట ప్రయత్నించి, ఇక ఆపుకోలేక గబాలున పైకి వచ్చి అంత శ్వాసని ఒకేసారి పీలుస్తున్నప్పుడు ఊపిరి మీద తప్ప వేరే దేని మీదకి దృష్టి పోనీ అనుభూతి తెలుసునా నీకు? దాన్నేమంటారు?
- మొదటిసారి సముద్రం అలల చివర్న సాహసంగా తొక్కి.. నీళ్ళు చల్లగా ఉన్నాయని ఎవరికైనా చెప్పాలనిపించే అత్యుత్సాహం. ఆ భావనని సరిగా అభివర్ణించే పదం.
- కరుణకు పరవశించి పోయే బుజ్జి కుక్కపిల్ల పశుత్వంలోని అమాయకత్వము! దీనికో పదం కలదా? అది చివరిగా నా మనసుని వర్ణించుకోటానికి!
నా ప్రేయసి నవ్వుని వర్ణించాలనుకోవటం సూర్యకిరణాన్ని విరిచి జేబులో పెట్టుకోవాలనుకున్నంత వెర్రి ప్రయాస!
ఆ నవ్వు వెలుతురులో photosynthesis చేసుకొని, గుండె దాహం తిరటానికి సరిపడా cardio-hydrates సమకూర్చుకొంటే దానికదే ఒక ముగింపు!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి