29, ఏప్రిల్ 2019, సోమవారం

ఫాసిజం వస్తోంది.

ఆకాశమంతా చస్తున్న జనాల అరుపులు ఉరుముతాయి,
మీడియా కప్పలు ఉత్సాహంతో బెకబెక మంటాయి,
మితవాద మిడతలు క్షుద్రమంత్రాలు వినిపిస్తాయి, 
ఏ కాగితం చుసినా దాని మీద ఒక అసత్యం రాసి ఉంటుంది,
ఏ గొంతుని కదిపినా భయంతో ఉలిక్కిపడుతుంది,
లేదంటే దయ్యంలా వికటహాసం చేస్తుంది!
అసత్యపు ప్రచారాల రణరొదలో అరిచి అలసి ఎండిన గొంతుకలు ఇంకిపోతాయి, 

చచ్చిపోతాయి, అగరొత్తుల్లా ఎగిరిపోతాయి,
దిగంతాలకవతల పిశాచగణాలు చేపట్టిన రహస్య యజ్ఞం నుంచి లేస్తున్న ద్వేషపు కావిరి ఆకాశాన్ని అలుముకుంటోంది,
భయంకర భయానక ఫాసిస్ట్ కారుమేఘం ఆకాశమంతా ఘనీభవిస్తోంది.
ఆమ్లాన్ని వర్షించబోతోంది. ఆపై ఈ దేశంలో కూర్చొని బొంచేసే వాడి చేతిలోని ప్రతి ముద్ద రక్తం వాసన వస్తుంది.

నవ్వుల పువ్వుల వసంతాల వెన్నల రాత్రుల కుసుమపరాగాల సౌరభానందంలో మునిగిపోయి,
ఎగువ మధ్యతరగతి కుటుంబ సుఖజీవన స్వప్నావస్థనే నిజమనుకొని శాశ్వతమనుకొని పరవశిస్తూ..
GOT మరియు Avengersల రంగుల వెలుగులతో కప్పబడిన కళ్ళతో
ఎప్పుడో ఒకసారి ఊసిపోక వార్తాపత్రికలు తిరగేసే
సుఖజీవన కాముకుల కళ్ళకి గబుక్కున గోచరించదీ సత్యం! వినిపించదీ ఘోరం!

జర్మనీలో గత శతాబ్దంలో..
హిట్లర్ ప్రజాస్వామికంగా ఎదుగుతున్న తరుణంలో అక్కడి ఎగువ మధ్యతరగతి సామజిక వర్గానికి చెందిన అనేక చదువరులు "మనదాకా వచ్చినప్పుడు సంగతి కదా .." అని కాళ్ళు తన్ని నిద్రించిన వారే. శుష్క వేదాంతం మాట్లాడిన సుఖజీవన కాముకులే! వాళ్ళ స్వార్థానికి ఫలితంగానే ప్రపంచంలోని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సిగ్గుపడాల్సినంత ఘోరమైన పర్యవసాలకు హిట్లర్ నియంతృత్వ పాలన కారణం అయింది. ఒక చారిత్రిక తప్పిదం ఒకసారి జరిగితే అది పొరపాటు. మళ్ళీ జరిగితే అది మహా పాపం.
ఫాసిజం ఉనికిని ఆదిలోనే గుర్తించటానికి కళ్ళకి కాస్త చరిత్ర తెలిసుండాలి. చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఫాసిజం ఒక నియంత పోలికలున్న వ్యక్తి కేంద్రంగానే వ్యాపిస్తుంది. ఇది కాలాతీత సత్యం. చాతనైతే చరిత్ర చదివి చావండి. లేకపోతే నెట్ఫ్లిక్ లో మునిగి ఏడవండి.


21 కామెంట్‌లు:

  1. సుఖజీవన కాముకులు ఎక్కువైనపుడే హిట్లర్ అవసరం వస్తుంది.
    హిట్లర్ కావలెను !

    రిప్లయితొలగించండి
  2. నిజం అండీ...ప్రతి ఒక్కరూ ఊరికే అన్నీ వచ్చేయాలనీ, ఏ మాత్రం కష్టపడకూడదనీ, హాయిగా చేతిలో మొబైల్ ఉంటే చాలు పనులయిపోవాలనీ అనుకుంటుంటే బెత్తం పుచ్చుకుని అదిలించి కదిలించే హిట్లర్ లేకపోతే సోమరిపోతులయిపోమూ ?

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు ఫాసిస్తులెక్కడున్నారు. అంతా భ్రమ!

    రిప్లయితొలగించండి
  4. # నీహారిక గారు
    ఫాసిస్ట్ అంటే సినిమాల్లో చూపించే "మంచి దొంగ" అనుకుంటున్నారా ఏమిటి? బెత్తం పుచ్చుకుని అదిలించడంతో ఆగడండీ ఫాసిస్టు.. అందుకే చరిత్ర గురించి తెలుసుకోండి అంటున్నారు ఈ బ్లాగర్ భానుకిరణ్.

    ఫాసిజం బాగా తలకెక్కి హిట్లర్ చేసిన దారుణాలు మానవచరిత్రలో ఒక రాక్షస అధ్యాయం కదా (The Holocaust). ఆ అమానుషాల గురించి మరింత తెలుసుకోవడానికి, జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో అర్థం కావడానికి వీలు చేసుకుని .... మచ్చుకు .... :- 👇

    Anne Frank వ్రాసిన The Diary of a Young Girl పుస్తకం చదవండి;
    -----------------
    Schindler's List మూవీ చూడండి (Netflix లో దొరకచ్చు 🙂);
    -----------------
    ఈ క్రింది విడియోలు చూడండి (caution :- అవి చూసిన తరువాత కడుపులో తిప్పుతోంది అంటారేమో చూసుకోండి మరి ☝️)

    Gen.Eisenhower visit to Nazi death camps

    The Liberation of Auschwitz

    Buchenwald atrocities

    -----------------
    హిట్లర్ రాక ముందు యూరప్ లో యూదులు ఎలా బతికారో ఈ విడియో చూస్తే తెలుస్తుంది 👇

    Glimpses of the Jewish life before the Holocaust

    ----------------
    అసలు ఫాసిజం గురించి కొన్ని వివరాలు ఈ వికీ లింక్ లో 👇
    ఫాసిజం
    ----------------
    ఇలా చరిత్ర గురించి చూస్తే ఫాసిజం మీద మీకేమన్నా ఫాసినేషన్ ఉంటే వదిలిపోతుంది hopefully.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🦁 ఫాసిస్ట్ లు ఫాసిస్ట్ లను ఏమీ చేయరు.తెలంగాణావాదులకు ఏదైనా నెప్పి కలిగితే పంటితో తీసేస్తారు అని కేసీఆర్ గారు చెపుతున్నారు కూడానూ !
      ఆంధ్రావాళ్ళకి నెప్పి కలిగితే ఇంకో హిట్లర్ పుట్టుకురాడా ?

      తొలగించండి
    2. విన్నకోట నరసింహా రావు గారు, మీ వ్యాఖ్యకి ప్రశంసలు!

      తొలగించండి
  5. మోదీ సోషలిస్ట్.. హిందూత్వ అనేది ఒక స్టంట్ !

    కేసీఆర్ ఒక ఫాసిస్ట్ & హిట్లర్ కి మనవడు.
    చైనాలో కమ్యూనిజం ఉంది కానీ వాళ్ళు కూడా ఫాసిస్ట్ లే అందుకనే కేసీఆర్ చైనా ఫెంగ్‌షుయ్ పాటిస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  6. మరో మాట. ఈ కాలంలో ఫాసిజం ఫలితాలు హిట్లర్ చేసిన దారుణాల రూపంలోనూ లెవెల్లోనూ ఉండకపోవచ్చు. కానీ ఆధునిక రాజకీయ నియంతృత్వ పోకడల వాతావరణంలో ప్రజలు బతకాల్సి వచ్చే పరిస్ధితులుండవచ్చు. ఈ బ్లాగర్ భావం కూడా అదేననుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనేక దేశాలలో (ముఖ్యంగా ఐరోపాలో) ఫాసిజం మళ్ళీ తలెత్తుతుంది. నిన్నటికి నిన్న స్పెయిన్ ఎన్నికలలో నాలుగు దశాబ్దాల తరువాత ఫ్రాంకో మరణంతో ముగిసిందనుకున్న ఆల్ట్-రైట్ పునర్దర్శనం ఇచ్చింది.

      https://www.theguardian.com/world/2019/apr/28/spain-election-socialists-to-win-most-seats-far-right-vox-resurgent

      "Vox performed slightly below expectations, but has still managed to become the first far-right grouping to win more than a single seat in congress since Spain returned to democracy after the death of General Franco in 1975"

      తొలగించండి
    2. 🦁,త్రేతాయుగంలో తప్పులు ద్వాపరయుగంలో పునరావృతమవ్వవు కానీ కొత్త తప్పులు చేయవచ్చు కదా ? అలాగే ద్వాపరయుగంలో తప్పులు కలియుగంలో పునరావృతం కావు.
      చరిత్రని అందరూ చదివి చావలేరు కానీ క(ఖ)ర్మ లు భోధిస్తారు కదా !

      తొలగించండి
  7. //చాతనైతే చరిత్ర చదివి చావండి// త్వరగా చదవకపోతే చరిత్ర కూడా చావచ్చు.
    భలే, కుండ భలే బద్దలు కొట్టారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVR గారు, సరిగ్గా చెప్పారు చరిత్రకి కూడా రోజులు దగ్గరపడతాయి!

      తొలగించండి
  8. 👆 రాజస్థాన్ సి.ఎమ్. అన్నదే వేదం అని కాదు గానీ మొత్తానికి ఎదుటివారి ధోరణిని పోకడలను ప్రజలు ఎలా గమనిస్తున్నారో, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారో తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి ఎన్నికలలో ప్రతి పార్టీ వైరిపక్షం గురించి ఇవే మాటలు అంటుంది. ఇందులో కొత్తేమీ లేదు.

      ఇకపోతే టపా సబ్జెక్టు ఫాసిజం, నియంతృత్వ పోకడలు కాదు.

      తొలగించండి
    2. ఫాసిజం ఉనికిని ఆదిలోనే గుర్తించటానికి కళ్ళకి కాస్త చరిత్ర తెలిసుండాలి. చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఫాసిజం ఒక నియంత పోలికలున్న వ్యక్తి కేంద్రంగానే వ్యాపిస్తుంది. ఇది కాలాతీత సత్యం. చాతనైతే చరిత్ర చదివి చావండి. లేకపోతే నెట్ఫ్లిక్ లో మునిగి ఏడవండి

      తొలగించండి
  9. ఎన్నికల rhetoric సంగతి వదిలేసినా, ఫాసిస్ట్ నుండి నియంతగా మారిన దాఖలాలున్నాయిగా చరిత్రలో.

    రిప్లయితొలగించండి
  10. Ultra Test XR Shark Tank Reviews Improving endurance and functionality is a substantial issue for guys as soon as they begin coming their 40s. The decrease in Unleash X Boost levels and sexual actions allow us to look for nutritional supplements that could assist in enhancing it.
    https://ultratestxr.svbtle.com/ultra-test-xr

    రిప్లయితొలగించండి
  11. Ultra Fast Keto Boost dietary weight loss supplement is based on the production of ketosis which is a hormone. Ketosis is the only reason for burning fat inside your body instead of carbs related meals.
    https://vk.com/@mariyawilsone-ultra-fast-keto-boost-reviews-work-shark-tank-real-price

    రిప్లయితొలగించండి