లోకంలో రెండు విపరీత రకముల మనుషులు గలరు ..
1) జీవితాన్ని ఓ దరకాస్తు పత్రంగా - ఓ templateగా భావించు వారు.
2) జీవితాన్ని ఓ తెల్ల కాగితంగా జూచు వారు.
1) వ్యక్తిత్వానికి శరీరం తొడిగితే వ్యక్తి యవుతాడని నమ్ము వారు.
2) వ్యక్తికి బట్టలు తొడిగితే వ్యక్తిత్వం అవుతుందని నమ్ము వారు.
1) తమ మనసుకి నచ్చితే కుంకుడుకాయని సైతం నిశబ్దంగా ఆస్వాదిస్తూ నమిలి మింగువారు.
2) నలుగురి పొగడ్తల కోసం చీకట్లో నల్లద్దాలు పెట్టుకొని పోవు వారు.
1) లోకమంతా నిద్రపోతుందని భావించే అవకాశవాదులు.
2) నిద్రపోతుంది తమేనేమో యని ఉలిక్కి పడుతూ గడిపే యదార్థవాదులు
1) అబద్ధాలతో స్వచ్చమైన ప్రేమని జీవితాంతం సంపాదించుకొని ఆస్వాదించగల నేర్పరులు.
2) నిజాలు చెప్పి కనీస కరుణకు నోచుకోలేని naive souls కొందరు!
1) భయంతో బందీలు - భక్తులు కొందరు!
2) భక్తీతో కొందరు భయ - బందీ విముక్తులు.
1) ఆకాశమంత అజ్ఞానం ముందు తలదించుకొను వినమ్రులు.
2) అణువంత జ్ఞానంతో ఆకాశమంత దర్పం కలిగిన వారు.
1) "సుఖి ఎవరో?" అని ప్రశ్నించు వారు.
2) తామే సుఖియని లోకాన్ని ఒప్పించ జూచు వారు.
1) పరమ పావనులు, ఘనులు, శాశ్వతులు, కమలభవ సుఖము సదానుభవులు!
2) కులం మతం రంగూ పౌరుషం కోసం మైత్రిని సైతం విడనాడ నిరాకరించని వారు.
1) ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు.
2) అందరూ ఏడిస్తే కాని తమ సుఖాన్ని కనుగోలేని వారు.
1) కృతజ్ఞతల కోసం సహాయము చేయువారు.
2) సహయము చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా కార్యాన్ని సలిపే వారు!
1) ప్రశ్నని ఆప్యాయంగా చేరదీయువారు, సమాధానం వంక అనుమానంతో జూచు వారు.
2) ప్రశ్న- సమాధానం - తర్కం - వాదం - ప్రక్రియ వంటి వాటికి అతీతంగా సరళంగా "క్లాసులు పీకే" వారు.
1) ఒంటరిగానైనా, నమ్మటం ముఖ్యం కొందరికి.
2) కనీసం ఒకరినైనా, నమ్మించటం ముఖ్యం కొందరికి.

1) మనుషుల్ని రెండు మూడు రకాలుగా విభజించి అర్థం చేసుకొని, వ్యంగ్యంగా వ్యాసాలు రాసే వారు ..
2) ప్రతి మనిషి కనుపాపలోను తమ ప్రతిబింబాన్ని మాత్రమే జూచువారు!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి