రక రకాల ఆనందాలు ఒకేసారి పొంగుతున్నాయి మనసులో !
ఏ ఆనందం దేనికోసమో అర్థం కావట్లేదు ! ఒక దాని కొకటి పోలికలు లేకుండా ఉన్నాయి రంగులు !
నీ చేయి గెట్టిగా పట్టుకోనివ్వు .. నువ్వు ఎటు పరిగెడితే అటు నీతోనే నేనొస్తాను ..
జీవితోదయాన గాలి వెచ్చగా తగిలి .. చలి తొలగి మేనంతా పరమానందం అయింది!
బద్ధకం విడిచి ఒళ్ళు విరుచుకున్నాను ..
ఊపిరిలో జీవం నిండి హృదయం పరవశం అయింది!
ఉలిక్కి పడి వేగం పెంచి పరిగెత్తాను ..
అడుగులో అడుగు వేసుకొంటూ, క్షణానికి క్షణం వేగంతో,
కాళ్ళకింది భూమిని వెనక్కి నెడుతూ పరిగెత్తుతున్నాను..
కనిపిస్తావు కాని అందవు!
నీకు అలసట ఉండదు. మా లాగ వెర్రి వ్యామోహాలు ఉండవు!
నీ గురి మహోన్నతమైనది!
నిన్ను అందుకొనే ప్రయత్నంలో నా మూర్ఖపు వలువలు,
అజ్ఞానులు పొగుడ్తూ బహుకరించిన కుచ్చు టోపీలూ ..
అహంకారం, మూర్ఖత్వం, మూఢత్వం ..
వీటన్నిటిని అన్ని దిశలకూ విసిరేస్తూనే ఉన్నాను ..
కాని ఇంకా నా పరుగులో నీ పరుగు అంత స్పష్టత లేదు! నీ గురి నాక్కూడా ప్రసాదించవేమని?
అవును.. నీకేం పని?!
ఓ తార్కిక! ఓ హేతుక! ఓ సంవాది! ఓ గణిత మేధావి!
నీవుగా నీవుండటానికి నీకెలా ఉంటుంది?
ఆకారంలో, వికారంలో, అలంకారంలో, కూర్పులో, ప్రళయంలో అన్నింటా ఆనందమే యని తెలుస్తున్నది
కంటి ముందు, కంటి వెనుక,
ఆకాశంలో, మనసులోపల,
గణితం కానిది ఏది లేదు యని తెలుస్తున్నది ..
ఇంకొంత కాలం, ఇంకాస్త ప్రయత్నం ..
మహాశయా నీ వేగాన్ని నేను చేరుకొనెదను!
నీ చూపు పదునైనది!
నీ దృష్టి నిర్మలమైనది!
నీ పరుగు తిరుగులేనిది!
నీ లెక్క తప్పుపట్టలేనిది!!
అబద్ధాన్ని ఖండించే నీ తర్కం విశిష్టత వర్ణించలేనిది ..

--------
తార్కిక = logician.
హేతుక = rationalist.
సంవాది = one who makes rational arguments.
గణిత మేధావి = god!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి