పిల్ల గాలుల్ని ఎదిరించి నిలిచిందియని శాశ్వతం అనుకోనేవు!
చమురు యండక మానదు, దీపం ఆరక మానదు.
జీవితం కథ - తెర పడక తప్పలేదు ..
ఒక విసురు, అయ్యగారు!
ఒక విసురుతో .. పోగేసుకున్నది మొత్తం పొగలాగు మారి స్వేఛ్చగా ఎగిరిపాయింది.
ఇన్నాళ్ళు కంఠానికి బిగుసుకొని బాధించిన ఊపిరి-ఉచ్చు నీకు విముక్తినిచ్చి పోయింది!
మొదటి నుంచి.. లోపల ఎడతెరిపి లేకుండా పొడుస్తున్న హృదయస్పందన కూడా నిన్నిక బాధించబోదు!
అలసట లేదు, అనారోగ్యం లేదు, చింత-భయం-భ్రాంతి లేదు.
ఇక వచ్చి బజ్జో మిత్రమా!
ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం లేదు ..
నిత్యం శాశ్వతమైనది చీకటి మాత్రమే ..
చీకట్లో మెదలగలిగేవి జ్ఞాపకాలు మాత్రమే.
----
సృష్టి ఏదో ఉద్దేశ్యంతో ఉత్సవ స్ఫూర్తితో పాట పాడుతోంది ..
ఆ మహా గానంలో ఒక గమకానివి నీవు!
గానం ఇంకా కొనసాగుతుంది, కాని దానిలో నీ పాత్ర అయిపొయింది ..
అయిపోయిన నీ పాత్రని స్మరించకు ..
అద్దె కొంప మీది మమకారం వీడి సొంత ఇంటికి చేరుకో మిత్రమా!
దిగులు వలదు ..
వెలుతురు చూసీ చూసీ నీ కళ్ళు అలసిపోయాయి చూడు ..
ఇక వచ్చి బజ్జో!
ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం లేదు ..
నిత్యం శాశ్వతమైనది చీకటి మాత్రమే ..
చీకట్లో మెదలగలిగేది జ్ఞాపకం మాత్రమే.
ప్రేరణ (గుల్జార్ రచనికి పూర్తి అనువాదం కాదు):
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి