వాక్యానికి మొదటి అక్షరం రాయనారంభించినప్పుడే చివరన చుక్క పెట్టాలని తెలియనివాడు / మర్చిపోయినవాడు / ఒప్పుకోలేని వాడు / నమ్మలేని వాడు - వాక్యాన్ని పిచ్చి వంకరలు తిప్పుతాడు, వెర్రి వాగుడు వాగుతాడు!
ఎప్పటికైనా అంతమయ్యే వాక్యమే అర్థవంతమైన వాక్యం.
చుక్కని చూసి భయపడటంలో రుచి లేదు,
చుక్క ఎక్కడ పెట్టినా అక్కడికి ఒక అర్థముండేలా అందమైన లోతైన పదాలని కూర్చడం రుచి.
ఈ రుచిలోని వ్యత్యాసాలే జ్ఞానంలోని వ్యత్యాసాలుగా రూపుదాల్చుకుంటాయి..
ఈ జ్ఞానమే తిరిగి వాక్యార్థంలో ప్రతిబింబిస్తుంది, కళని తెస్తుంది.
ప్రతి ఒకరికి ఒక్కో వక్యాన్ని రాసే అవకాసం దొరికింది, తమ తమ జీవిత వాక్యాన్ని ఎలా తీర్చి దిద్దుతారు అన్నది తమతమ కళా-రుచి, రుచి-కళ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి