1)
నువ్వంటే నాకు సిగ్గో - భయమో అర్థం కాదు!
నా పట్ల నీకు కోపమో - చులకనో అంతు చిక్కదు.
నీ నుంచి నేను ఉద్భవించానో, లేక నా ఊహలో నువ్వు ఘనీభావించావో తేల్చుకొనే వీలు లేదు.
ప్రశ్నిస్తున్నావో, పరిక్షిస్తున్నవో, అర్థం కానీ సమాధానాలు చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావో?
2)
లోభానికి - భక్తికీ మధ్యన ఎన్ని అడ్డ చారలు గీసినావు?
ప్రేమకి - వ్యాపారానికి మధ్యన ఎన్ని పరదాలు పరిచినావు?
అద్దంలో తన కండలు చూస్కొని మురిసిపోయే యువకుడికి - పుత్రోత్సాహంతో పొంగిపోయె ముసలాయనకి
మధ్య చత్వారంలో ఎన్ని పాయింట్ల వ్యత్యాసం కూర్చినావు?
చీకటికి - చీకటికి మధ్యన ఎన్ని ఉదయాలు అమర్చినావు?
3)
* సముద్ర గర్భంలో జీవరాసుల రంగుల వెనకాల మర్మం ఏమిటీ?
* సికాడా ఈగలకి ప్రధాన సంఖ్యలకి సంబంధం ఏమిటీ?
* ఒక్కో జాతి తేనెటీగకి ఒక్కో పువ్వు మక్కువ అవుతుందా?
* గడ్డి తనను తానూ రక్షించుకుంటుందా?
* రోబోటిక్స్ జీవసస్త్రానికి ఎలా తోడ్బడుతుంది?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి