- ప్రాణానికి అత్యంత ప్రియమైన రాగం
ఆరోహణం ఎగసి ఎగసి శిఖరాగ్ర తీవ్రతకు చేరి అక్కడే ఆ పై చరియలలో గమకంగా ఊగిసిలాడుతున్న తరుణం!
- ఓ మహానుభావుడు అత్యంత శ్రద్ధగా రాసిన పుస్తకం చదువుతుండగా
ఇంకొక పుట దూరంలో మహాసత్యం ఒకటి బోధపదిపోతుందని స్పృహకి వస్తున్న తరుణం.
- తప్పు పొల్లుపోకుండా గుక్కతిప్పుకోకుండా కొనసాగుతున్న కవితా పఠణం..
తరువాతి పంక్తిలో వెంట్రుకలు నిక్కపోడుచుకొనే వర్ణన రాబోతుందని తెలిసి ఆత్రం..
- ఎప్పుడో ఆకతాయిగా నాటిన పిచ్చి విత్తనం
ఓ ఉదయం అనుకోకుండా చూసేసరికి నన్ను పలకరించి నవ్వుతున్న పచ్చదనం..

- ప్రపంచంలో ప్రతి అణువుకి రుణపడి ఉన్నాననిపిస్తూ
ప్రతి అణువుకి నాతోనే పని యనిపిస్తూ లోలోపల నిరాడంభరత వేషంలో తలకెక్కుతున్న గర్వం.
- తెల్లారితే ఇంటికి బుజ్జి కుక్కపిల్ల వస్తుందని తెలిసి
ఉత్సాహంతో నిద్రపట్టక ఆనందంతో మనసు పెడుతున్న కలవరం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి