రండి రండి రండి మా మతంలో చేరండి.
చాల సులువు.
సత్యశోధన గోంగూర కాదు. డైరెక్ట్ సక్సెస్ మీద ఉంటుంది మా దృష్టి.
వివరంగా చెప్తాను వినండి.
1. మా మతంలో అర్థంకాని తికమక చెత్త ఏమి ఉండదు.
2. సత్యాన్వేషణ , ఉపనిషత్తులు, లోకం ఉందా లేదా? నిజామా మాయా? ఉంటె ఎలా సాధ్యం అయింది? లేకపోతే ఎందుకు ఉందనిపిస్తుంది? పనికిమాలిన తర్కం.. ఏవిటి ఇదంతా? స్కూల్లో లెక్కలు చేసి దొబ్బించుకుంది చాలదా? అంత అలోచించి బుర్ర పగల గొట్టుకోవాల్సిన అవసరమా?
3. safe + simple + guaranty success అనేది మన నినాదం.
4. భగవాన్ని ప్రసన్నం చేస్కోడం అంటే మహారాష్ట్రకి a/c టికెట్ బుక్ చేసామా, చటుక్కున executive queue లోకి దూరామ, లటుక్కున భగవాన్ని ప్రసన్నం చేసుకున్నామ. అంతే it is that simple!
-----------
యోగి: నిజమైన భక్తి అంటే భగవంతుని కోసం పరిగెట్టడం కాదు. "నేను ఎవరు?" అన్న ప్రశ్నని బలంగా కలిగి ఉండటాన్నే భక్తీ అని ఉపనిషత్తులు నిర్వచించాయి. అన్ని చోట్ల భగవంతున్ని చుడగలటం. సర్వం భగవత్నిర్మితం అని బోధపరుచుకోవటం. మాట నోటితో చెప్పటం వేరు, బోధపరుచుకోవటం వేరు. పూర్తిగా బోధపడిన తర్వాత చెప్పనవసరమే ఉండదు!
నేను: ఎక్కడ చూడమంటున్నావ్ బాసు దైవాన్ని? పక్కింటి వాళ్ళ కుళ్ళు చూపుల్లో, వీధి కుక్కల రొధలో, నల్ల మొహాలు వేసుకొని చూసే ముష్టి వాళ్ళ కరువు చూపుల్లో - కంపు నోళ్ళలో - మురికి పల్ల సందుల్లో.. ఎక్కడ? కాకుల అరుపుల్లో, ఆవు పేడలో, మనిషి పేడలో.. ఎక్కడ చూడమంటున్నావ్? తత్త్వం బోధపరుచుకోవటాలు తలకాయి నొప్పులు చేసే సమయం లేదు నాకు. ఏదో నా బ్రతుక్కి ఒక ఉద్యోగం, comfortable sex కోసం మాంచి పిట-పిట లాడే ఫిగర్ కలిగిన ఒక భార్య, నా వీర్యంతో, నేను పెట్టిన తిండితో నిర్మించబడి నా మీద భయభక్తులు కలిగిన ఒకరిద్దరు పిల్లలు. ఇవన్ని కాపాడుకోవటానికి ఒక accessible god. అది చాలు నాకు. I am busy dying everyday, man.
----------
హ్యాపీగా ఒక వారం రోజులు vacation తీసుకొని ఫ్యామిలి బంధాలు, కాస్త showoffకి సరిపడా మంచి బట్టలు, మంచి comfortable inner-wear, నగలు, luggageలు అన్ని pack చేసుకొని comfortableగా స్వామి వారి ఊరికి చేరుకోవాలి ముందు. ఆ ఊరు latitude-longitude location దగ్గర పడుతుండగానే ఏదో మహత్యం జరిగిపోతున్న buildup ఇస్తుంది మనసు. ఎంత ఆహ్లాదకరమో! పెళ్ళాం నగలు అన్ని బద్రంగా ఉన్నాయో లేదో కూడా మరిపింప చేసే లాంటి భక్తి పరిమళం ఉంది ఆ గాలిలో. (మీరు మరీను, ఊరికే వెటకారానికి అన్నా గాని దూల దీర్చుకొని మరీ కొన్న నగల సంగతి మర్చిపోతానా చెప్పండి?). Mr. స్వామి సిమెంట్, కాంక్రీట్, వైట్ వాష్, స్టీల్ అండ్ ఐరన్ తో నిర్మించబడిన ఆలయంలో ఆసీనులై ఉన్నారు. ఆలయం చుట్టూ మనలాంటి భక్తులు. కానీ అల అని competitive worldలో everything has to be competed for కదా? అందరికి onsite కావాలి, కాని first-come-first-serve strategy ఇదంతా.
ఆలయం చుట్టూ ఉండే competitive క్యూ గురించి వర్ణించి రాయాలంటే ప్రత్యేకంగా ఒక వ్యాసం పడుతుంది. క్యూలో భక్తజనులు అనేక పనుల్లో తనువూ మనసు నిమగ్నం చేసి ఉంచుతారు. చమటలు, maazaలు, భక్తి-ప్రేరేపిత-దుర్ఘందభరిత-కుస్మితములు, బొంట్రోతుతో వాదనలు, గొడవలు, చీరలు, oglers తాపత్రయం, కొత్త పెళ్లి జంట పవిత్రమైన legal సరసాలు. ఒకటా రెండా అది భక్త జన పరివారం.
క్యూ.. గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఒక్కోసరి భగవాన్ విగ్రహానికి వెనక భాగానికి చాల చేరువకు కూడా వెళ్తుంది. అప్పటికీ దర్శనం అయిన లెక్కలోకి రాదు. నేరుగా లోపలికంటే వెళ్లిపోవాల్సిందే. ఎక్కడ ఆగకుడదు. అంటే అక్కడ వరకు భగవంతుడు లేడు అని అర్థం. డైరెక్ట్ విగ్రహానికి ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి వెళ్ళిపోయి ఆ పంతులు చేత బూతు తిట్టించుకొని మరీ protestతో భక్తిని చాటుకోవాల్సిందే. విగ్రహాన్ని పదిలంగా మనసులో పెట్టుకుంటే దర్శనం పూర్తి అయినట్టు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా meditation చేశానే!!
------------------
యోగి: భగవత్ దర్శనం అనేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని చేరుకోవటమే మనవ జన్మ పరమావధి. ఆ అనుభూతికి 'తరవాత' అన్న ప్రశ్న ఉండదు. అన్ని ప్రశ్నలకి సమాధానం అపోరక్షనుభూతి ద్వార పోదటంతో మాయ తొలగిపోయి భ్రహ్మంతో చిత్తం ఏకమైపోతుంది. అద్వైత స్థితిని చేరుకున్నాక ఇంక నువ్వు-నేను, అది-అదికానిది, ఇది-ఇదికానిది, వేటికి అర్థం ఉండదు.
నమ్మకం అనేది ఉత్త పనికిమాలిన మాట. దేన్నీ గుడ్డిగా నమ్మవలదు. తర్కంతోనే ఈ చిక్కుముడి విప్పబడుతుంది. దేన్ని నమ్మి దేన్ని సమర్పించేస్కోని దేన్ని పొందుదామని ఆశగా చూస్తున్నావ్ మహారాష్ట్ర భగవాన్ రాతి విగ్రహం వైపు? ఇవ్వటానికి-తీస్కోతనికి నాది అని చెప్పుకోడానికి ఏమున్నది నీ దగ్గర, విగ్రహం దగ్గర? నీ శరీరం అనుకొనేది నువ్వు నీ జీవితం అంతా కరువు కొద్ది తిన్న తిండి. నువ్వు దేన్నైతే అనునిత్యం కామిస్తున్నావో, దేని కోసం ప్రార్థనలు చేస్తున్నావో ఆ స్త్రీ చెక్కిలి వెనక ఉన్న మాంసం ముద్ద గతంలో చెట్టుకి పండుగా, దానికి ముందు మట్టిలో పెంటగా, దానికంటే ముందు ఏ జంతువు కడుపులోనో మురుగుతున్న మలంగా ఇలా సృష్టి ఆరంభం నుంచి రూపాలు మారుతూనే ఉంది. ఈ భౌతిక పదార్థాన్ని నువ్వు ఇవ్వలేవు తీసుకోలేవు అనుభవించనూ లేవు. సౌకర్యవంతమైన మతాన్ని పాటించే వాళ్ళు ఈ జన్మకి ఈ చుట్టూ కనిపించే మృత పదార్థాన్ని మించి ఉన్నతమైనది ఏది ఆశించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు అని అర్థం.
అర్థం-పర్థం లేకుండా ఏర్పడిన 'జన్మ' అని పిలవబడే ఈ ప్రశ్నల వలయం నుంచి విముక్తి పొందటానికి ఉపనిషత్తులు అనేక మార్గాలు బోధించాయి. ఒక్కో మార్గాన్ని ఒక్కో యోగం అని పిలిచారు. మళ్లీ చెప్తున్నా, ఈ యోగాలన్ని భౌతిక భ్రమ నుంచి ఆత్మని తప్పించటానికి మార్గాలు మాత్రమే కానీ నువ్వు పోయాక నీ శవానికి బంగారు సమాధి నిర్మించుకోడానికో, ఇక్కడే మట్టిమసానంలో చచ్చి-కుళ్ళి-లేచి-పడే ఈ శరీరానికి సేవ చేస్కోడానికో చిట్కాలు కావు ఇవి. ఈ అనేకములైన యోగాల్లో, హఠ యోగం ఒకటి. హఠమ్ అంటే అణగ త్రొక్కుట అని అర్థం ఉంది. ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఇంద్రియప్రలోభం వల్ల సృష్టించబడిన ఈ మాయాపొరని అణగ త్రొక్కే మార్గం విచారించబడింది. ఇక పోతే ...
నేను: బాసు, ఆపు! ఆపేయి!! మాకు wikipedia ఉంది. మేము చూసుకుంటాం. ఈ మాత్రం matter మాకు తెలియక కాదు. meditation అంటే చేట భారతం విప్పేసావు. నాకు తెలిసినంత వరకు meditation అనేది successకి secret. శరీరంలో ఉండే circlesని ఏకదమ్ అదుపులో పెట్టి BP, sugar, hyper tension etc రోగాల పని పట్టడానికి easy shortcut. నాకు వ్యక్తిగతంగా mind concentration పెంచుకోడంలో చాల బాగా సహాయపడింది. సంపాదించుకున్న concentrationని ఒకొకళ్ళు ఒకోదానికి వాడుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. బాసు this is democracy! చేసేది rape అవని, business management అవని - concentrationతో చేయాలంటే meditation is the method.
-----------------------
ఇంకా కొన్ని comforts చర్చిస్తాను వినండి.
- నిత్యం భక్తి moodలో ఉండాలంటే కష్టపడిపోయి శాస్త్రీయ సంగీతం నేర్చుకోనక్కర్లేదు, క్లిష్టమైన సంస్కృత శ్రుతులు, స్మృతులు, కావ్యాలు చదివి అర్థం చేస్కొని తల పగలుగోట్టుకోనక్కర్లేదు. Dead easy. మీ భక్తికి కావాల్సిన important songs అన్నిటిని professional singers తో చక్కగా already మీకు అలవాటు ఐన ట్యూన్స్ లో రికార్డు చేసిన dvds అందుబాటులో ఉన్నాయ్. కారులో పెట్టుకోండి. భక్తే భక్తి.
- భగవాన్ సాంగ్ తో calling bells ఉన్నాయ్. పెట్టుకోండి. మంచి జరుగుతుంది.
- భగవాన్ హారతి live టీవిలో ప్రసారం అవుతుంది. టీవీలోంచే దర్శనం చేస్కోవచ్చు.
- జల్ది-five-చరితం అని ఒక పుస్తకం ఉంది. భగవాన్ చరిత్రని ఐదు chaptersలో సులువైన, సరళమైన, సూటైన పదజాలంతో అన్ని భాషల్లో రాసి ఉంచారు. జీవితంలో కష్టం వచ్చిందా? డింగ్-డాంగ్-డిష్! పుస్తకం తీసి పూర్తిగా చదివెయ్యండి. ఇక సక్సస్సే సక్సస్సు! అదే కథ ఎన్ని సార్లు చదివితే అంత సుఖం.
- customization అనేది మన మతంలో అడుగు అడుగునా ఉంటుంది. మన భగవాన్ పేరుని ఏ దేవుడు అంటే ఆ దేవుడు పక్కన అంటించుకోండి. సనాతన ధర్మం అని పిలవబడే దానికి మన నూతన ధర్మానికి చక్కటి glueగా ఈ liaisons సహపడతాయి.
- కులాలు, పరువులు, కట్నాలు, కష్టాయాలు ఇవన్నీ మాములే సుమా!
----------------
యోగి: హఠ యోగం ప్రకారం - యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి - అన్న ప్రక్రియ ద్వారా మోక్షసాధన సాధ్యముతుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ ఒక్కో దశని గురించి వివరిస్తాను.
నేను: నీ వివరణ మడిచి గోచిలో పెట్టుకోవయ్య బాబు.
----------------
అహింస పాటించాలి అనుకుంటున్నారా? గురువారం, శనివారం non-vegetarian తినటం మానేయండి. అది మొదటి మెట్టు, అదే చివరి మెట్టు. బుధవారం రాత్రి తిన్న మాంసం కడుపులో కుళ్ళనియండి ఏం కాదు. మిగిలిన ఐదు రోజులు కుమ్మిన కుమ్ముడు కుమ్మకుండా కుమ్మి కుమ్మి కుమ్మండి. వితండ వాదం చేసే తార్కికులు వచ్చి హేళన చేస్తే "అహింస అని కాదు. కేవలం ఒక అలవాటు మాత్రమే. self control కోసం" అని చెప్పండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే "నా అలవాట్లు నా ఇష్టం అని చెప్పండి!" తార్కికుడు మళ్ళి మాట్లాడలేడు. మాట దాటి వెయ్యటం బాగా నేర్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తర్కపరమైన చర్చల్లోకి దిగవద్దు. "ఏదో బాబు మాకు మీ అంత తెలివితేటలు లేవులే ఊరుకో" అనే బ్రహ్మాస్త్రమ్ అందుబాటులో ఉంచుకోండి. ముఖ్యంగా ఎందుకంటే మనమేదో మనకి additional సౌఖ్యం చేకురుతుందేమో అన్న ఆశతో భగవాన్ని నమ్ముతున్నాం కాని మనకి మాత్రం ఏం తెలుసు? అందుకని నోరు అదుపులో ఉంచుకొని freedom of belief ని exploit చేస్కొండి.
భగవాన్ పేరుతోటి ఏం త్యాగాలూ చేయొద్దు. మీ పని వత్తిడి, మీ ఆరాట-పోరాటలు భగవాన్ కి బాగా తెలుసు. అవకాసం వచ్చినప్పుడు మాత్రం లోకల్ భగవాన్ గుడికి వెళ్ళండి. గుడికి వెళ్లి, ఆఫీసు కోరికలు, బెడ్ రూమ్ కోరికలు, బాత్రూం కోరికలు అన్ని కోరుకోండి. ఇబ్బడి-ముబ్బడి గా ధనం ఉనప్పుడు మాంచి దౌర్భాగ్యపు రూపం గలిగిన ముష్టివాళ్ళని నలుగురిని choose చేసుకొని కాస్త దానం చేసి అల్పనందానికి గురి అవ్వండి. ఊరికే దేన్నీ త్యజించాల్సిన పని లేదు. లాభం లేదు అని తెలిస్తే మీ శరీరాన్ని మనసుని ఊరికే కష్టపెట్టుకోవద్దు. భగవాన్ మనల్ని కష్టపడమని చెప్తాడా? లేదు. comfortableగా ఉండమని చెప్తాడు. ఈ comfort కొనసాగటానికే ఈ భక్తీ వగైరా. అసలు మన comfortsకి ఏం ధోక లేదని తెలిసింది అనుకోండి, ఇంకా భక్తి దేనికి? భగవాన్ దేనికి? నేను చెప్తుంది ఏంటో మీకు-నాకు మాత్రమే తెలుసు. భగవాన్ కి కూడా తెలీదు. మహిమగల భగవాన్ అండీ, వీలైనంత జుర్రుకుందాం రండి.
==============================================
పై వ్యాసం రాసి మీ మనసులు బాధపెట్టి ఉంటే నాకు అదే చాలు.