19, మే 2014, సోమవారం

నాన్ వరువేన్!

నేను వచ్చెద!
మళ్లీ వచ్చెద!
నిన్ను వెంటాడెద! 
నిన్ను నా ఉపిరితో తాకెద!

ఎవరో పసికూన గీస్తున్న పిచ్చి రాతలే జీవితమందువా?
దానిలోని అర్థం ఉన్నదని వెతుకులాడి ఏడ్చేది ఉత్త దురద అందువా?
కొంత అర్థమవుతున్న దనుకోనేంతలో జీవితం మెలిక తిరిగుతున్నదే.. 
ఒక్కో మెలికతో దాని అర్థం కూడా మారిపోతున్నదే!

అదిగో.. కళ్ళ ముందే స్వప్నం గాలిలో రెపరెప లాడుచున్నది!
రెప రెప లాడుతూ నన్ను చూసి వెక్కిరింతగా నవ్వుచున్నది!
ఎవరో పసికూన గీసి పారేసిన పిచ్చి రాతలే జీవితమందువా?
దానిలోని అర్థం వెతుకులాడి ఏడ్చేది ఉత్త దురద మాత్రమేనందువా ?
కారణం లేకనే ఏడ్చి పేచీ నెగ్గించుకొని మరీ ఈ లోకంలోకి నేను వచ్చితినందువా?

నేను వచ్చెద!
మళ్ళి వచ్చెద!
నిన్ను వెంటాడెద! 
నా ఉపిరితో నిన్ను నేను తాకెద!

-------------------------------------------------------

మూలం: రచయిత వైరముత్తు గారు రాసిన ఒక తమిళ సినిమా పాట!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి