25, నవంబర్ 2014, మంగళవారం

కార్యసాధకా!

నీ మాట వినేవాళ్ళు లేకపొతే, నీతో రాకపోతే ..
                      ఒంటరి గా అడుగు వెయ్యి!

అందరూ భయపడితే, ముఖం దాచేసుకుంటే, పిరికిగా గోడచాటున దాక్కోనేస్తే ..
                       ప్రాణ మిత్రమా ..
                       ఆత్మసాక్షిని గుప్పెట్లో పట్టుకొని, మనసులోని మాటని నోరు తెరచి చెప్పు!

అందరూ తిరిగి వెళ్ళిపోతే, నిన్ను ఒంటరిని చేసి కారడవి చీకట్లో వదిలేసి పోతే?
                        సఖా ..
                        ముళ్ళ మీద అడుగులు వేసుకుంటూ
                        రక్తం కారుతున్న పాదాలను ఈడ్చుకుంటూ మార్గం చేసుకుంటూ ముందుకు సాగు!

దీపం వెలుగక పొతే,
చీకటిలో, గాడ్పులో, తుఫాను వానలో, గూటికి దిక్కుతెలియని స్థితిలో ఉంటే  ..
                        ఓ కార్యసాధకా!
                        మబ్బుల మధ్యన వజ్రాయుధాన్ని పెకలించి తీసి నీ హృదయాన్ని అంటించుకో!
                        దాన్ని ఉజ్జ్వలంగా వెలుగని! ఆ తీవ్ర జ్వాలలో స్వయంగా  ప్రకాశించు!

---------------------------

ఇది టాగోర్ రాసిన  'ఏక్ల చోలో రే' అనబడు బెంగాలీ గీతానికి (ఇంచుమించు) తెలుగు అనువాదం. 2005 కాలంలో తోటి బెంగాలీ మిత్రులు పాడుకుంటుంటే  అయిష్టంగా విన్నది! అప్పటికి బెంగాలీ  భాష ((మరియు దాని గొప్పదనం) కనీసం ఇప్పుడంత కూడా) తెలియననప్పటికీ ఆ గీతం చాల శక్తివంతమైనదిగా ఆ రోజే నా చెవులకు వినిపించింది. హ్రస్వదృష్టితో చుస్తే బిందెడు నైరాశ్యం, కాస్త నిశితంగా చుస్తే సముద్రమంత స్ఫూర్తి ఈ పాటలో వినిపిస్తాయి. ఒంటరితనంలోని realityని, inevitabilityని, blissని, permanencyని ఆహ్వానించలేని వాళ్ళు ఒంటరితనానికి దూరం పరిగెట్టి పరిగెట్టి జనారణ్యంలో చిక్కుకొని ఒంటరులు అవుతుంటారు. నూతిలోకి నేరుగా పడే రాయి ఒకటైతే కాస్త శబ్దం చేసి పడే రాయ మరొకటి.


2 కామెంట్‌లు:

  1. "ఎవరూ కేక విని రాకపోయినా సరే ఒకడవే పదవోయ్..
    అపుడు ఒక్కడవే ఒక్కడవే ఒకడవే పదవోయ్..."
    ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ రజనీకాంతరావుగారి తెలుగు అనువాదం, ఈ గీతానికి వారి బాణీ క్రింద లింక్ లో వినచ్చు..:)
    http://samgeetapriyaa.blogspot.in/2012/05/blog-post_10.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నలుగు విషయాలు
      1. బెంగాలీ భాషలో pronounsకి లింగ బేధాలు ఉండవు. కాబట్టి పుమిలింగంలో గాక generic లింగంలో పాటలో సంభోదన మొత్తం సాగుతుంది.
      2. తెలుగు పాటలో మూడవ చరణం ఎగిరిపోవటం బాధాకరం.
      3. మంచో చెడో, నేను ఈ పోస్ట్ రాయటం వళ్ళ బాలాంత్రపు రజనీకాంత రావు గారి గురించి తెలిసింది. మీ ద్వారా. ధన్యవాదం! :)
      4. మీ 'సంగితప్రియ' పోస్ట్స్ చూసాను. చాల reach out అయ్యి మరీ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు!

      తొలగించండి