2, ఆగస్టు 2014, శనివారం

కామెడీ శపథం! (కథ)

చిన్నా-చితకా కథలు రాసుకుంటూ గడుపుతున్న పికాసోకి జీవితంలో ఒకప్పుడు ఉన్నట్టుండి అత్యంత విషమ పరీక్ష ఒకటి ఎదురైంది. పేడో తాడో తెల్చేస్కోవాల్సిన సమయం ఆసన్నమయిపోయింది! దాని ఫలితంగా చివరికి అతని జీవితమే శాశ్వతంగా మారిపోయింది! అయితే ఆ పరిస్థితిలో పికాసో ఏం చేసి నెట్టుకొచ్చాడు, ఆ ప్రయత్నంలో ఏం నేర్చుకున్నాడు, చివరికి ఎలా బయటపడ్డాడు అనేది చాల మందికి తెలియదు. మరి ఈ రోజు ఎవిరినైనా కదిపితే మాత్రం పికాసో గురించి నా కన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసేసు నన్నట్టు మాట్లాడేస్తారు. ఏదో అవసరంలో ఉన్నాను కాబట్టి నోరు మూసుకొని ఎవరికీ చెప్పకుండా ఈ కథని గొంతులో దిగమింగుకొని ఉన్నాను.


పికాసో అసలు పేరు పుత్తూరు కాశి సుందరేశుడు. బెంగుళూరులో మెడలో బ్యాడ్జి వేసుకొని కంప్యూటర్ ఉద్యోగం చేస్తుండే వాడు. వాళ్ళ నాన్న తెలుగు styleలో 'కాశి సుందరేశ్' అనే నామకరణం చేసాడు. మరైతే మనోడేమో 'రేశ్' ని కాస్త 'రేశుడు' అని మార్చుకొని.. notaryతో affidavit రాయించుకొని అన్ని certificateలతో జత చేసుకొని మరీ పంతం నెగ్గించుకున్నాడు. మరి పికాసో భాషాభిమానం ఎట్టిదో అర్థమ యుండాలి. కార్పోరేట్ అరణ్యంలో నెట్టుకొస్తున్నా పాపం మనోడికి మనసంతా తెలుగు భాషోద్ధారణ మీదే ఉండేది. స్వచ్చమైన తెలుగులో మాట్లాడాలని తపత్రేయపడేవాడు. వీడితో మాట్లాడితే communication skills పోతాయని తెలుగు groupsలో కూడా పికాసోకి ఆదరణ అంతంత మాత్రం గానే ఉండేది. కాని పికాసో దీన్ని ఎప్పుడూ లెక్క చేయలేదు. సమయం దొరికనప్పుడల్లా తెలుగులో tragedy, documentary కథలు రాసుకుంటూ ఉండేవాడు. ఒకరిద్దరు మొహమాటానికి చదివినప్పటికీ .. మొత్తం మీద కథలు రాసుకొవటం, చదువుకొవటం, విమర్శన, సమీక్ష అన్నీ తానే చేసుకొనే వాడు. అయితే నెమ్మదిగా ఈ వ్యవహారం ఎందుకో విసుగు కలిగించింది. ఒక రకమైన మానసిక సంక్షోభం తనలో వేళ్ళు విస్తరించింది. “ఎవరూ చదవనిది రాయటం దేనికి? నా కోసం నేను రాసుకోడానికి ఈ శ్రమ అంతా ఏంటి దరిద్రం కాకపోతేను? .. ఈ introversionని ఇంతటితో విడనాడి జనాలందరికీ నచ్చేలాంటి మాంచి కామెడీ కథ ఏమైనా రాసి పేరు గడించాల్సిందే.” అనుకున్నాడు.


“ఒరేయ్ బాబు! నీకు నవ్వటం అంటేనే ఏంటో తెలియదు.. నువ్వు expert అయిన ఆ ఏడుపుగొట్టు topicsలు మీద రాసే రాతలే చదివే వాళ్ళు అంతంత మాత్రం. నువ్వు పోయి కామెడీ రాస్తే … హిహి.. ” అన్నాడు ఒక మిత్రుడు.


“మామ్స్! నువ్వు కేక మామ్స్.. కుమ్మేయి అసలు..” అన్నాడు ఇంకొకడు.


"మీరు మనసుకి నచ్చింది ఏమైనా రాయండి. నాకస్సలు సమస్య లేదు. కాకపోతే పుస్తకం title, story, content, theme మాత్రం 'success'  అనే పదం చుట్టూ తిరగాలి చాలు. పుస్తకం తెలుగునాట వేడి వేడి బజ్జీలు లాగ అమ్మడైపోతుందండీ!" అన్నాను నేను.


“అరుపులు మెరుపులు పకపకలే మావా.. సాగదీసి కొట్టు మావా.. అచ్చడి పోవాలి మావా .. రచ్చ రంబోలా!! ఇంతకి ఎవరు హీరో?” దొడ్డి కెళ్ళొచ్చి చేయి కడుక్కోకుండా మంచం మీద కూర్చుంటూ అన్నాడు roommate.


“చూడరా.. కామెడీ కథ రాయటం అంటే సైడ్ హెడ్డింగ్గులు పెట్టి వ్యాసం రాయటం కాదు. రాసే వోడు ఏడుపు గోట్టువాడైతే ఏం రాసిన ఏడుపే. నాకు తెలిసి నువ్వు హాస్య కథ రాస్తే అది హాస్యాస్పద హాస్య కథ అవుతుంది” అన్నాడు ఉచిత సలహాల బాద్ షా ఒకడు.


ఇలా జనాలు గాలి తీసేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి పికాసోకి మరింత పట్టుదల తన్నుకొచ్చేది. నలుగిరికి రుజువు చేయటం మాట ఎటున్నా.. అసలు జోక్ వెయ్యటం అంటే ఏంటి? అనే దాని మీద తనకు నైపుణ్యం ఉన్న డాక్యుమెంటరీ స్టైల్ లోనే research చేయదలిచాడు. తనకి sense of humour లేని మాట నిజమే అనుకుంటే.. తనలో హాస్యం ఏమాత్రం లేదనే అనుకుంటే .. జనాల్లోకి వెళ్లి వాళ్ళ sense of humourని వడగట్టి నాడి పట్టుకోవాలని ఆలోచించాడు. తెలుగు వాళ్ళు అధికంగా నివసించే ఖరీదైన apartments చేరువలో ఒక summer swimming camp నిర్వహిస్తున్నారని తెలిసి research కోసం అక్కడికి వెళ్ళి, ఒక notebook తెరిచి వేవ్వేరు వ్యక్తులతో తాను అక్కడ సాగించిన ఆసక్తికరమైన సంభాషణలని దానిలో చేర్చేవాడు. ఈ ప్రయత్నం ఎటు వెళ్తుంది అన్నదాని మీద అప్పటికి పికాసోకి ఒక స్పష్టత లేదు. నాకు చెప్తే “విజయం నీదే! ఓటమిని ఓడించు! సక్సెస్ ఈజ్ లైక్ ఇడ్లీ-పెసరట్టు గో-అండ్-గెట్టిట్టు!” గాల్లోకి smoke ring ఒకటి వదులుతూ అన్నాను నేను.


=================================================================


రోజు -1



మొదటి రోజు పికాసో వెళ్ళంగానే ఒక నిలువు నామం చేవిపోగులు పెట్టుకున్న ఒక వ్యక్తి తారస పడ్డాడు. ఆయనతో పికాసో మాట కలపటానికి ప్రయత్నించాడు.


పికాసో: నమస్కారం సార్. నేను ఒక చిన్న రచయితనండీ, ఒక సరికొత్త తరహాలో comedy plot plan చేస్తున్నానండి. ముఖ్యంగా Urban readers దృష్టిలో ఉంచుకొని ఈ రోజుల్లో తెలుగు వాళ్ళ కామెడీ అభిరుచిని తెలుసుకోవాలని మీతో మాట్లాడదలుచుకున్నాను ..
నామం మనిషి: అబ్బే నాకు interest లేదు. ఇప్పుడేమి వద్దు బాబు.


పీ: సార్, మీరు పొరబడుతున్నారు. నేను salesmanని కాదు software  engineerని. ఒక కథ రాయాలని ప్రయత్నిస్తూ ..
నామం: ఓహ్! చంపేశారు సార్! ఏం కంపెనీ అండీ? KVM gold coins business గురించి విన్నారా?


పీ: లేదండీ.. అసలు ఎప్పుడూ వినలేదు.
నామం: అసలు మీలాంటి youngstersకి చాల useful అండి ఇది. Own house ఉందా? మీ package ఎంత చెప్పండి అసలూ?
అంటూ పికాసో మొహం దగ్గరికి దగ్గరికి వచ్చేసాడు.


అప్పుడు తెలిసినది పికాసోకి ఆ మనిషి నోటి దుర్గంధం!!!
గబ్బు కంపు!
ఏవిటీ గబ్బు?!
నీయమ్మా జీవితం!! ఏమి తిని చచ్చాడో.. కథ రాయకపోతే చచ్చినా పర్లేదు.. ఈ గబ్బు ఇంకొక క్షణం భరించటం తనవళ్ళ కాదని తెలుసుకొని పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి బయట పడ్డాడు.
కుళ్ళిన ఏనుగుని కడుపులో దాచుకున్నాడా? ఎవరీ మనిషి? ఎవరీ గబ్బు దేవుడు? ఎవరీ మహాశక్తి?
-----

పార్కింగ్ లాట్ లో ఒక well dressed gentleman వెళ్తుంటే పికాసో ఆయన్ని ఆపాడు. ఆపి మాట కలిపి విషయం తెలియపరిచాడు
wdg: చూడండి.. నిజానికి నేను ప్రొఫెషనల్ కమెడియన్ని,  మీకు సహాయం చేయాలని నాకు చాల ఉంది. కాని నేను just last week ఒక కన్నడ సినిమా project sign చేసి ఉన్నాను.. కాబట్టి క్షమించాలి..
పీ: ఏం మాట్లాడుతున్నారు? మీరు cinema sign చేస్తే నాతో ఒక ఐదు నిముషాలు మాట్లట్టానికి ఏమి కష్టం మీకు?

wdg: చూడండి.. ఇలా అంటున్నానని వేరేగా అనుకోకండి. నేను అసలే మాట్లాడేటప్పుడు జోక్స్ ఆపుకోలేను. మాటిమాటికి జోక్ వేసే అలవాటు నాది. మీతో మాట్లాడుతూ పొరపాటున నా proprietary జోక్స్ ఏమైనా బయటకి దోర్లేసాయి అనుకోండి.. కాపీరైట్ ఉల్లంఘన అయిపోతుంది.. మా ప్రొడ్యూసర్స్ కి జవాబు చెప్పుకోవాలి నేను.. కబట్టి please.. హింసించకండి. మర్యాద మిగుల్తుంది మీకు! Get your ugly face out of my way!


రోజు -2



స్త్రీల పూల్ వైపుకి వెళ్ళాడు.
అక్కడ ..


పీ: చూడండి.. నేనొక రచయితని.. కామెడీ కథ ఒకటి రాయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాను.. మీరు సహకరిస్తే మీ నడవడికలు సంభాషణలు నిశితంగా గమనించి కథా పదార్థం తాయారు చేస్కుంటాను..
ఆంటీ: క్యావెడీ రాస్తావా? మమ్మల్ని చుస్తే  క్యావెడీ గా ఉందా నాన్న నీకు?

పీ: అబ్బే, హహ, బలే వారే.. కథాపదార్థం కోసం అండి.. మీ గురించి రాసేది ఏం ఉండదు…
ఆంటీ: ఆహా..  అబ్బో. నీ పదార్థాలు అంటకట్టుకోడానికి వెర్రి వాళ్ళు ఎవరూ లేరుగాని ఇక్కడ.. పైకెళ్ళు అమ్మ. ప్రతి యదవకి దాని మీదే దృష్టి. వెదవ వెకిలి చేష్టలు, అవతారాలు. పదార్థం అంట .. వెదవ వేషాలు.

పీ: ఏం మాట్లాడుతున్నరండి? ఎందుకు నేను అననివి ..
ఆంటీ: Shut the bloody nonsense or I will call police!


-----------------


అమ్మాయి: చూడండి. అందరు అబ్బాయిలూ ఒకేలా ఉంటారనట్లేదు. But కొంత మంది rogues ఉంటారండి… first రోజు interview అని వంక పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, తరువాత రోజు కను రెప్పలు ఎగరు వేస్తారు, ఆ next day దగ్గరికి వచ్చి భుజమ్మీద చేయి వేసి నడుం గిల్లుతారు.. మెడ మీద ముద్దు పెడతారు. కళ్ళల్లోకి చూసి చెవిలో పాడు మాటలు గొణుగుతారు. ఆ next day MY GOD! అందుకే నేను అస్సలు అబ్బాయిలతో మాట్లాడనండి. ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి parentsకి inform చేస్తాను.  police complaint ఇచ్చే వరకు తెచ్చుకోకండి.


పికాసోకి ఆ మాటలు విని మబ్బిడిపోయింది! అరి చేతులు చమటలు పట్టేసినాయి. నోరు ఎండిపోయింది. "నాయనో కదిపితేనే పోలీసులు అంటున్నారు!" అని భయపడిపోయాడు. కాళ్ళు వణికిపోయాయి. అక్కడనుంచి లగెత్తుకొని పారిపోయాడు. అతని వెనకాల అమ్మాయలు అందరు పడి పడి నవ్వారు. పికాసోకి విషయం అర్థమయ్యి మొహం ఎక్కడ పెట్టుకొవాలో అర్థం కాలేదు. మగతనం నిలబెట్టుకోలేకపోయినా కనీసం గుండె అయితే కొట్టుకుంటుంది చాలు అనుకున్నాడు.


రోజు -3


పీ: నమస్తే సార్.. శుభోదయం. ఎలా ఉన్నారు?  
youth: Nothing man f9 gr8 .. juzZz rOcCkKinG! It is not very easy to walk with these stylish shoes man. They tend to slip on this floor around the pool. అందుకనే sitting here and juzzZZ roCkiNg in piss.

పీ: Do you mean 'peace' sir?
youth: yeah.. swat I said. CheCkoUt my tattoo and gOgGLES. I cAmE from fOreigN… and I dO eNglish joB with white people! iT rocKkkZZZzz!!

పీ: చాల సంతోషం సార్. నేను కూడా software లోనే పని చేస్తున్నాను. నేను కథలు రాస్తుంటాను ..
youth: ఓహో! ఏం కథలు రసవేంటి ఇంత వరకు?
పీ: వాస్తవికతని ప్రతిబింబించే కథాంశాలు తీసుకుంటూ ఉండే వాడినండి. ఒకసారి అలానే బెంగుళూరులో భిక్షాటనం చేస్తూ జీవనం సాగించే తెలుగు దొమ్మరుల మీద కథ రాసాను. చాల మంది మెచ్చుకున్నారు. కాని జన సామాన్యానికి చేరువయ్యే లాంటి తేలిక బరువు సరదా హాస్య రచనలు చేయాలని ..

youth: ఓకే.. on-site try చేయలేదా మరి?
పీ: లేదు సార్. భారతీయ ప్రభుత్వ కార్యయోజనాలకొరకు పని చేయాలన్నది నా అభిలాష. విదేశం వెళ్ళాలన్న వ్యామోహం పెద్దగా లేదు.

youth: From starting i yam objerving. నేను casualగా మాట్లాడుతుంటే కూడా you are continuously speaking drama Telugu. ఎందుకు ఆ OA తెలుగు? మాములుగా మాట్లాడలేవా?
పీ: అంటే తెలుగు భాష మీద మక్కువ ఉంది అయ్యా.

youth: నీ మొహం చూస్తుంటే నాకొక తెలుగు సమేత గుర్తుకోస్తుంది - అయ్యా! Realistic రచయితని అంటున్నావుగా నీ కథలో పెట్టుకొనే ధైర్యం ఉందా?
పీ: చిత్తం. ధైర్యమే లేకపోతే రచనలు చేయటం దేని కండీ. మీ భావం ఏంటో మీ భాషలోనే వ్యక్తపరచండి. తప్పకుండ కథలో చేరుస్తాను.

youth:  వెనకటికి నీలాం టోడు ఎవడో "దెంగలేక.. మంగళవారం అన్నాడంట". ఒక English talking లేదు, ఒక foreign going లేదు, stylish dressing లేదు, goggles wearing లేదు! ఏం జీవితం అయ్యా? ముందు నీ careerలో పైకి రావటానికి try చేస్కో. colleaguesతో contacts పెంచుకో. You can go abroad. లేకపోతే ఇలాగే you keep sucking. ఇదిగో .. బాసూ …  నా పేరు  detailsకాని  నీ ఎర్రి పప్ప కథల్లో mention చేసావంటే basement వాచిపోద్ది జాగ్రత్త!” అని warning ఇచ్చి సెలవు తీసుకున్నాడు Mr. Sagar babu, Mainframes admin, TCS Salarpuria, Bangalore.
పీ: “సరే సార్, sorry అండీ.”

రోజు - 4



అంకుల్: Interview అంటే ఏం చేస్తారు? ఏం ఏం ప్రశ్నలు అడుగుతారు ?
పీ: లేదండి.. ఊరికే మీ జీవితం గురించి, వృత్తిని గురించి.. కుటుంబ జీవితం గురించి టూకీగా మాట్లాడుకుంటాం అంతే..


అంకుల్: ఆగండి.. నా కుటుంబం గురించి మీకెందుకు? అయినా నా జీవితం గురించి తెలుసుకొని కామెడీ రాయటం ఏంటండి ?


పీ: అలా కాదండి. ఈ విషయం మీద ఇంత మంది నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో తెలియటం లేదు. కామెడీ అంటే మిమ్మల్ని కామెడీ చేయటం కాదండీ .. మీ జీవితంలో మీకు ఏయే విషయాలు నవ్వు తెప్పిస్తాయో తెలుసుకొని మీ అభిలాషలను పరిశీలించి ఏ రకమైన హాస్యమైతే జనాల్లోకి వెళ్లి చేరుతుందో తెలుసుకోవాలని ఒక ప్రయత్న మండీ. మీరు సహకరిస్తే ఒక అయిదు నిమషాలు కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను.
అంకుల్: Sorry, not interested.
పీ: ok, thanks sir.


---------------------------
అంకుల్ గారు: సూపర్ అండీ. కామెడి అంటే నా దగ్గర చాల ఐడియాస్ ఉన్నాయి. తప్పకుండ మంచి కథ రాయొచ్చు  మనమూ !
పికాసో: మనమా? అరే కాదండీ.. మీరు తప్పు అర్థం చేస్కున్నారు.. మీ ప్రత్యక్ష సహాయం కావాలని నేను కోరట్లేదు నేను.. కేవలం మీతో సంభాషించి .. మీ ద్వారా ..


ఆగా: ఓ, హ్మ్మ్,  ఓకే ఓకే.. మన పురాణాల్లోనే చాల కామెడీ ఉందండి నిజానికి… మీకు నేను చాల ఐడియాస్ ఇవ్వగలను.. ఉదాహరణ చెప్తాను వినండి..
పీ: కాదండి.. మీరు చెప్తుంది నిజమే అయుండొచ్చు. కాని నా థీమ్ నేను ఎలా ఫిక్స్ చేస్కున్నాను అంటే .. సామాన్య జనాలతో సంభాషించి, వాళ్ళ ..


ఆగా: సామాన్య జనాల్లో కూడా అసామాన్య శక్తులు ఉంటాయి man!మీరు పురాణాలు చదవరా?
పీ: నేను చెప్తుంది .. ok .. లేదండి నాకు దైవ చింతన పెద్దగా లేదు. పురాణాల మీద అంత ఆశక్తి లేదు.


ఆగా: వయసులో ఉన్నప్పుడు నీ లాంటి fools అందరు చెప్పే మాటలే ఇవి. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక own apartment కొనుక్కొనే కష్టాలు మొదలైనప్పుడు you'll realize how important it is to be devotional.
పీ: కర్మ అంతవరకు కాలిపోయాక ఇంకెంత కాలినా ఒకటే లెండి.


ఆగా: అంటే? ఇప్పుడు మా అందరి కర్మ కాలిపోయింది అంటున్నావా నువ్వు?? చూడు బాబూ.. you are just a బచ్చా.  Are you listening? You are just a baby! మేమందరం నీలాగే science and technology మోజులో పడి ఒకప్పుడు religionని ignore చేసిన వాళ్ళమే. But all your bullshit sci-tech and internet.com were mentioned millions of years ago in our puranas and vedas and mahabharata  and ramayana. Heard about telepathy? Can your iPhone compete with that? Pushpak viman!!! దాని ముందు మీ jumbojet ఈక! ఈకతో సమానం! Atom bombs, nuclear weapons, Test tube babies  were mentioned in mahabharata. E = mc² was known to lord Indra! అందరు ఏం చేస్తున్నారో అది చెయ్యి baby boy. నీకే మంచిది. Go and read swamiji’s commentaries on puranas. And watch swamijis live speech on TV everyday. I challenge you, the Sundaresh I'm going to meet after 10 years will be a complete devotee of Swamiji. You are at the brink of accepting it. I can see it in your eyes. I can see the invisible hand of Swamiji on your head. Blessings be upon you. ఈ రోజు రాత్రే నువ్వు ఇంటికి వెళ్ళాక miracles చూస్తావు చూడు! Just accept swamiji’s image in your heart. Stop thinking with your brain and start thinking with your heart..


(అంకుల్ గారు .. ఎప్పటికి ఆపలేదు .. )


రోజు - 5


కేసు 1: comedy? why comedy? Did you give a thought to suspense thriller?
పీ: తెలుగులో మాట్లాడగలర?

కేసు 1: షూర్, ఆఫ్ కోర్స్. But see, tell you what, let it initially take off as an entertainer, ok? And you can have each of these characters pop in at regular intervals with their comedy quirks and what not. Let the story gather some momentum. Once that’s done, plan a neat interval bang. You see where I’m going? Interval bangs give you this opportunity to color it all again, with more creative shades.. you see where I’m going?
పీ: ఓహ్!

కేసు 1: Yeah yeah, plan a suspense thriller. Please! That’ll have a wider reach. You can have comedy and romance mixed in as side notes. Catch my drift? All the best.
పీ: అలాగే సార్.
----------------------

కేసు 2: అవునవును మీ కథలు తెలుసు నాకు.. నెగటివ్ గా థింక్ చేస్తారు ఎందుకు మీరు?  ప్రశాంతంగా కళ్ళు మూసుకొని.. పాజిటివ్ గా ఆలోచించండి హ్యాపీగా ఉంటారు.
పీ: అలాగే తప్పకుండానండీ.. కాని ఇప్పుడు సమస్య నా పాత కథల గురించి కాదండీ.. ఇప్పుడు నేను కామెడీ రాయదలుచుకున్నాను..

కేసు 2: ఫస్ట్ థింక్ positively అండీ. మీరు కంప్లీట్ negative గా థింక్ చేస్తున్నారు కాబట్టే కామెడీ రాయటం అంటే కష్టపడుతున్నారు. అదే positive థింకింగ్ తో థింక్ చేస్తే మీ కష్టం సగమవుతుంది లేదా మీ సౌకర్యం రెట్టింపు అవుతుంది. Positive thinking is the key Mr. Picasso think positively. ఇందాక నుంచి మీ body language గమనిస్తున్నాను. కంప్లీట్ నెగటివ్ body language మీది. కాళ్ళతో తిన్నంగా నడుస్తున్నారు, motion urgent అవుతునట్టు. అలా కాదు.. free movementతో 'plus' shapeలో  steps వేసుకుంటూ నడవాలి. Then you'll give an impression that you have a positive personality.
పీ: ఓహ్! positive attitude ఉన్నవాళ్లు ఇవన్ని చేస్తారా? లేకపోతే ఇవన్ని చేస్తే positive అయిపోతారంటున్నారా?

కేసు 2: చూసారా? మీరు వేసే questions ఉన్నాయ్ చూసారా? completely negative! You have to do something about it అండీ. Personality development training classesలో మేము మా clients తరచూ చెప్తుంటాము ఒకటే మంత్రం "Fake it until you make it!" Perhaps you should try out our training sessions.
పీ: తప్పకుండ సర్, నా పాత కథలు ఏం చదివారు అనట్టు మీరు?

కేసు 2: చుడండి, నేను నెగటివ్ థింకింగ్ అసలు భరించలేను..
పీ: అయితే నా కథలేమి చదివి ఉండరుగా?
కేసు 2: A sentence with ‘no’ in it is a negative one! I rather avoid using them in my speech. I usually confine my reading to positive material. I like Ketan Bharat and Dosapudi Surendranath's works to name a couple.

రోజు - 6


Gentleman: అది సరే కాని.. ఇది చెప్పవయ్య.. Did you ever invest in business? I did! I sold  latex from kerala and made a huge fortune. Married a mallu chick. I own three.. are you listening? I own three freaking apartments in Bangalore man! If that is not an achievement, what is? People go around on all sorts of crappy endeavours to get recognition from their peers. I bet there's nothing equal to earning a shit load of money. Look at me, try to be like me young man. I see potential in you, ఈ స్టోరీస్ రాయటం సినిమా వాళ్ళ చుట్టూ తిరగటం. That's not going to take you anywhere.
పీ: I certainly value your suggestion sir. కాని కథలు రాసేది సినిమాల కోసమే కాదు సర్, pure literature రాసే ఉద్దేశ్యంలో ఉన్నాను.


GM: Dude, you must be kidding me! Who reads Telugu these days man? I never do. It earns me zilch. I never taught Telugu to my kids as a matter of fact. They speak Tamil, Hindi, Malayalam to some practical level, and are super duper eloquent in English.  Don't be an old school conservative moron. You are wasting your time. All this effort earns you zilch. Make some bloody money man!
పీ: తప్పకుండా సార్, మీరు చెప్పింది నేను తప్పకుండా మనసులో పెట్టుకుంటాను. మీ కంపెనీలో products గురించి ఏమైనా చెప్పండి. మీ లైఫ్ స్టైల్.. వర్కింగ్ స్టైల్ .. మీకు నవ్వు తెప్పించే సంఘటనలు etc?


GM: We make condoms with latex. And sell them.
పీ: I thought condoms are made of some sort of rubber అండీ?


GM: హహ నీ వయసెంత? I seriously doubt if you ever used one! హహహ!!!
పీ: అంటే .. ప్యాకెట్ మీద సరిగా చదవలేదు అనుకుంట సార్ బహుశా..
GM: హిహిహి  నిజం చెప్పు man..  you still are a sissy virgin aren’t you?
హిహిహి ఇదిగో it is in situations like these that I laugh my ass off హిహిహి. Sorry man, your face is so funny! హిహిహి  హోహో హిహిహిహి !!!! Oh, this reminds me of something. This happened a couple of years ago..


పీ: సార్ తెలుగులో చెప్తారా?
GM: Exactly my point. Just listen. So this dumbass customer of ours files a case against us in the court. Guess why? He apparently used vaseline to lube up his condoms and the contraception failed! And he thought he could sue us with that shit. What fools don’t realize is they are not supposed to use petroleum based lubricants with latex condoms. Who teaches you this kind of shit? Your telugu bullshit never does. I bet he was an idiotic pussy like you!
ఓహ్ hey! By the way, here.. hear me out.. I’m in deep shit right now and I need your help. ఆ పిల్లాడు ఉన్నాడు చూసావా.. ష్… come closer, he’s not my, err.. legitimate son.  And my guess is that my wife is getting a hunch about these risky little sexual secrets of mine. The bitch may have employed snitches to track my moves in the city. So it’s not easy for me to drive this kid around safely. And the kid’s mother nags me nonstop to take him out to entertain and shit. Pain in the ass and pleasure in the dick kind of situation. See what I mean..?హిహి!!! I’ll give you all that you want, would you do me a favor? ఈ పిల్లాడిని తీసుకెళ్ళి వాడమ్మ ఇంట్లో అప్పగించేయాలి, car దాని placeలో park చేయాలి, autoలో return వచ్చేయాలి. I’ll pay you for all this. Thousand bucks solid! ఎవరి దగ్గరైనా ఒక మాటైన జారినట్టు తెలిస్తే మాత్రం I'll castrate you, remember! Deal?


రోజు - 7

- ఆపకుండా health tips చెప్పే వాడు ఒకడు
- Chit funds
- Insurance policy agent.
- Pyramid society agent..
మొదలైన వాళ్ళంతా పికాసోని left and right వాయించారు.


పికాసోకి బుర్ర పిచ్చెక్కిపోయింది.. జనాలకి నవ్వు ఎలా తెప్పించాలి? ఇన్ని రకాల బిన్న మనస్తత్వాలు, వ్యామోహాలు, పిచ్చులూ, భయాలు, దురదలు ఉన్న జనాలకి అందరికి కలిపి ఒకేసారి హాస్యాస్పదంగా ఉండే విషయం ఏముంటుంది? ఎక్కడ వెతకాలి? ఎలా ఎలా ఎలా ఎలా… అని పూల్ చుట్టూ తిరగనారభించాడు.


గబుక్కున జారి పడ్డాడు! “ఓర్నీయమ్మ! ముడ్డి చితికి పోయిందిరా బాబూ!!” అని కేక పెట్టాడు. పూల్ దగ్గర జనాలందరూ ఒక్క సారిగా విరగబడి నవ్వేసారు. వారం రోజులు నుంచి వెధవ ప్రశ్నలు వేసి బుర్ర తిన్నాడనో ఏమో.. పిల్లలు, పెద్దలు అందరూ పికాసోని చూసి నవ్వే నవ్వు! పికసోకి ఆశ్చర్యం అయింది! జీవితం మొత్తానికి తను ఒక చేష్ట చేయటం - దానికి జనాలు ఈ స్థాయిలో నవ్వటం ఇదే మొదటి సారి! నెమ్మది నెమ్మదిగా పికాసోకి విషయం అర్థం కావచ్చింది.. జనాలని నవ్వించటం అంటే నవ్వులపాలు కావటమే.. లేదంటే ఎవడో ఒకడిని నవ్వులు పాలు చేయటమే! That’s the recipe, that’s the recipe! పెదవి మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది.. లేచి దులుపుకొని, కళ్ళజోడు పెట్టుకొని అందరి మొహాలు వరసగా చూసాడు. ఒక నలుగు క్షణాలు అలా చూసి పెద్ద పెద్దగా నవ్వుకుంటూ కుంటుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతనికి పిచ్చి పట్టిపోయింది అనుకొని అక్కడ అందరు ఇంకా ఇంకా నవ్వేసారు.


***************************************************************************************************


తరువాతి కొన్నేల్లల్లో..   
“నేను సన్నాసి వెదవని.”
“నాకు డిప్పకాయలు కొట్టండి ప్లీజ్.”
“తింగరోడిని!”
“Red flower!”
“పిచ్చ పకోడీ!”
"నా గూబ వాచిపోవ, మీ ఇంట నవ్వులు పండ!"
మొదలగు శిర్షికలతో అద్భుత హాస్య రచనలు అతివేగంగా రాసి: క్లాసు - మాసు - ఫ్యామిలి - యూత్తూ - ఓల్దు - డెడ్ - అలైవ్ బేధాలు లేకుండా హాస్య ప్రియులందరి హృదయాల్లోకి శరవేగంగా దూసుకెళ్లి గుక్క తిప్పుకోనివ్వకుండా నవ్వించాడు. తెలుగు people ఇంటిల్లపాది easyగా understand చేసుకోవటం కోసం English, हिंदी, ଓଡ଼ିଆ, 한국의, 中国的, عربي, Deutsch, 日本の, русский భాషల్లోని పదాలను విరివిగా ప్రయోగించి సరళమైన రచనలు చేసేసాడు. తన రచనలతో ఓ దశాబ్ద కాలమంతా ఏకదాటిగా జోక్సు వేసేసాడు. పికాసో పేరు చెప్తే చాలు తెలుగునాట జనాలు ఒకటే laughing. ఆపుకోలేని పెద్ద పెద్ద laughing.  "నవ్వుల పువ్వుల తోటమాలి" అని బిరుదాంకితుడయ్యి చరిత్రలో చిరస్థాయిగా seat reserve చేసేస్కున్నాడు.


మా పాత పరిచయాన్ని ఉపయోగించుకొని పికాసో చేత personality development బుక్ ఒకటి రాయించాలని నా చిరకాల వాంఛ. ఆ matter discuss చేయటానికే ఇవ్వేళ ఎట్టకేలకి appointment దొరికింది. I have my fingers crossed! Wish me good luck and success.


*******************************************సమాప్తం **********************************************

1 కామెంట్‌:

  1. హాస్యం కి మూలం మనిషి లో అంతర్గతం గా ఉండే sadism అని నా అభిప్రాయం... హింస లోనుంచి హాస్యం పుడుతుంది...
    to be more precise comedy is generated when a superior encounters an inferior ( whatever the context might be)
    :)
    your theme concurred with my opinion Bhaanu...
    keep up
    kanchi

    రిప్లయితొలగించండి