21, మే 2016, శనివారం

ప్రస్తుత సమాజంలో వివక్ష


(త్వరలో రాబోయే ఒక రచనకి ముందు 'నా మాట')


ఈ రోజుల్లో అంతర్జాలంలో గాని, పుస్తక దుఖానాల్లో గానీ.. 19వ శతాబ్దపు యూరోపియన్ సామ్రాజ్యవాద ఆటగాళ్ళ చేతుల్లో పావుల్లా నలిగిపోయిన ఆఫ్రికన్ దేశాల చరిత్రలకు సంబందించిన తెలుగు సాహిత్యం పెద్దగా కనిపించదుమన దేశ నగరాల్లో footpath మీద Mein Kampf పుస్తకాలు విరివిగా లభ్యం అవుతుంటాయి. దీన్ని చూసి నాకు అశ్చర్యంగా ఉంటుంది. హిట్లర్ తన ద్వేషపూరిత భావజాలన్ని సమర్ధించుకొంటూ రాసిన చెత్త మీద భారతీయుల కెందుకంత ఆసక్తి? మొన్నమొన్నటి దాకా జెర్మనీలోనే అచ్చుకు నోచుకోని ఈ పుస్తకానికి మన దేశంలో ఇంత ఆదరణ ఏంటి? హిట్లర్ ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాసుకున్న nonsenseని చదవాలని ఏమిటంత ఉత్సాహం? ఇంకొక పక్క మన దేశంతో పోల్చుకో దగ్గ ఇతివృత్తాలు కలిగినవైన మధ్య-ఆఫ్రికన్ దేశాల భూత వర్తమాన గతుల గురించి మన తరం భారతీయులు సరిపడ అక్కరు కనబరుస్తున్నారా? నా అనుభవాన్ని బట్టి చూస్తే లేదనిపిస్తుంది. విదేశాల్లోని నివసించే భారతీయులు వారికక్కడ తారసపడే నల్ల జాతీయులతో పెద్దగా స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోరు; వాళ్ళతో తమని పోల్చి చూసుకోరు. వీలైనంత వరకు శ్వేతజాతీయుల్ని అనుకరించటం; వారి గుంపుల్లో కలిసిపోడానికి ప్రయత్నించడం; వారి attention కోసం ప్రాకులాడటం; అవకాశం చిక్కినప్పుడు భారతదేశం గురించి చిన్నో చితకో గొప్పలు చెప్పుకొని వాళ్ళ మెప్పు చూరగొనే ప్రయత్నం చేయడం; లేదంటే భారతదేశాన్ని తిట్టైనా వాళ్లకి దగ్గర కావాలని ప్రయత్నం చేయడం.. వంటివి స్పష్టంగా గమనిస్తాము. ఒక భారతీయ యువకుడు ఒక నల్లజాతి యువతిని ‘date’ చేయటం అనేది ఒక దిగజారుడు వ్యవహారంగా - నవ్వులపాలు చేసే విషయంగా భావిస్తారు (దీన్నే మన సినిమాల్లో కూడా చూపిస్తారు, అది చూసి మనం నవ్వేస్కుంటాం కూడా); ఇక ఒక భారతీయ యువతిగాని నల్ల జాతీయుడితో జత కట్టడం అనేది అసలే ఊహించలేము! దీనంతటినీ నేను అనుభవపూర్వకంగా చుసాను; చూసి.. బానిసత్వ ‘సౌఖ్యాన్ని’ వంట్లో నరనరాన్న సంతరించుకొని ఉన్న భారతీయులు జాతి జాతిగా Stockholm syndromeకి గురైపోయారా అని నా అంతరాలంలో నేను చాలా సార్లు  ప్రశ్నించుకున్నాను! నా ప్రశ్న సబబైనదే నని ఈ రోజుకీ నమ్ముతున్నాను. Globalization అంటే కేవలం తెల్లతోలు వ్యామోహమేనా? లేక వివక్ష అనేదాన్ని మనసు లోలోపల్నుండి, అది ఏ రూపంలో ఉన్నా కూడా, సమూలంగా తొలగించుకొని అన్ని జాతుల వాళ్ళనీ సహభ్రాతృత్వంతో సమానంగా చూడగలగడమా? ఒక జాతిని లోకువతో చూడటం ఎంత తప్పో, మరో జాతి మీద వ్యామోహం కలిగి ఉండటం కూడా అంతే తప్పు కదా? అసలు మనిషిని మనిషిగా చూడటం మానేసి ఈ జాతి ఆధారిత prejudiceలు ఏంటి? విశ్వమానవీయ భావాలనేవి ఎవరికి వాళ్ళు స్వయంకృషితో పెంపొందించుకోవల్సినవి అనుకోవడం చాల దురదృష్టం. ఇవి మనకి విద్యాబుద్ధులతో పాటే మన సమాజం నేర్పించి ఉండాల్సినవి. కాని మన పెంపకంలో మన ముందు తరం ఈ విషయాన్ని తగిన శ్రద్ధతో handle చేసింది అనిపించదు. అందుకనే IPL cricket cheerleaders అందరూ శ్వేతజాతీయులేయయినా, సిమెంటు కంపేనీ వాళ్ళు Build Beautiful అని perverse advertisements మన ముందుకి తెచ్చినా, fairness cream వాళ్లు తమ వికృత ప్రకటనలు మన మొహానికి రుద్దినా, మన కళ్ళెదురుగానే రైల్వే స్టేషన్లలో పట్టాల మీద మనిషి మలాన్ని ఉత్త చేతులతో ఎత్తి శుభ్రపరుస్తున్నా .. ఏది మనకి పెద్దగా అభ్యంతరకరంగా అనిపించవు. కాని శిలా శాసనాల మీద రాసిన కథల్నీ, క్రతువుల్ని, దేవుళ్ళ చరిత్రలనీ ఏమైనా అనే సాహసం ఎవరైనా చేస్తే మాత్రం క్షణం సహించము! ఏదేమైనా Status quoని కళ్ళు మూసుకొని accept చేయడం, వ్యాప్తిలో ఉన్న భావజాలాలను ప్రశ్నించకుండా ముందుకు కొనసాగటం అనేవి ముందు తరంవాళ్ళు మనకి మంచిగా నూరిపోసారు. మనలో చాలా మంది ఆలోచనలు మన కుటుంబాలకు, కుటుంబ గౌరవాలకూ పరిమితాలు అయిపోయేలాగా, ‘సమాజం, సామూహిక పురోగతి’ వంటి మాటలు పేద్ద out of syllabus jargon గా పరిగణించేలా మనల్ని తీర్చిదిద్దడం కూడా మన ముందుతరం తప్పిదమే నని నేను భావిస్తున్నాను. ఇదంతా చాలా దురదృష్టకరమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనిషి తనని తన పుట్టుకకు కారణమైన కుటుంబంతో మాత్రమే identify చేసుకోక సమస్థ మానవ చరిత్రకి కొనసాగింపుగా చుసికొన్నట్టైతే చరిత్రలో అన్యాయానికి, వివక్షకి గురైన జాతులు లేదా వర్గాల పట్ల సహజమైన సానుభూతి కలుగుతుంది. ఈ సానుభూతి కలగడానికి ఒక ప్రత్యేక సామాజిక నేపథ్యం కలిగి ఉండవలసిన అవసరం కూడా లేదని నేను నమ్ముతాను. గతంలోని తప్పులన్నీ సమిష్టి తప్పిదాలే, గతంలోని గొప్పలన్నీ సమిష్టి గొప్పలే అన్నట్టు భావించి వర్తమానంలో సమసమాజస్థాపన అనేది మన ముందున్న కర్తవ్యంగా ముందుకి సాగిపోవాలి. దొంగతనం, హింస వంటి వాటిలానే వివక్ష అనేది కూడా మెదడులో కలిగే ఒక మలినమైన ఆలోచనయనీ - అప్రయత్నంగానైనా అలాంటి ఆలోచన మెదడులో కలిగితే దాన్ని psychosis(మానసిక రుగ్మత)గా పరిగణించి ఆ మనిషికి వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసే స్థాయికి మానవ సమాజాలు ఎదగాలి. ఎలాంటి సామాజిక అంశమైనా గాని.. ‘Neutrality’ దెబ్బతింటున్నదన్న ప్రతిసారీ ఇంట్లో, ఇంటి బయటా కూడా బహిరంగంగా చర్చలు జరిగటం వంటివి చూసినప్పుడు పిల్లల్లో ఈ వివక్ష దోరణి బాల్య దశ నుండే క్రమంగా తొలగిపోతుంది. మన తరమైనా ఈ ప్రయత్నం చేస్తే రాబోయే తరాలు విశాల దృక్పథాన్ని కలిగివుండే అవకాశం ఉంది. వాస్తవానికి  దీనంతిటినీ ఆచరణలో పెట్టడానికి మనం ఎంతో దూరంలో ఉన్నాము అన్నది విదితమే. మనుషుల్లో వివక్షపూరిత భావాలను తొలగించే పనిని సమాజం మూకుమ్మడిగా పూనుకొని ప్రయత్నంగా నిర్వహించాలి. ఈ ప్రయత్నం మన చట్టాల్లో, చట్టాల నిర్వాహణల్లో, మన పాలకుల భాష్యాల్లో, ప్రభుత్వ పథకాల్లో, సాహిత్యంలో, సినిమాల్లో, అన్నిటినీ మించి విద్యా వ్యవస్థలో అడుగడుగునా గోచరించాలి. ప్రయత్నంగా శ్రమిస్తేగానీ ఈ జాఢ్యం మనల్ని వదిలిపోదు.

11 కామెంట్‌లు:

  1. Well said! Surely there are many among us who think the same way, but the 'traditionalists' and 'right wingers' are an overwhelming lot who do not want social injustice to be removed and everything that they do not like they tend to downplay as 'వామపక్ష భావాజాలం'.

    రిప్లయితొలగించండి
  2. ఏమిడిదీ సుత్తి. ఎందుకు ఈ రేంజిలో తింటావు బ్రదర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రియమైన బ్రదర్!
      ఎవరి ఏడుపులు వాళ్ళం ఏడ్చుకుందాం సరేనా?

      తొలగించండి
  3. అంతే భయ్యా నిజాలు చెబితే, అందులోనూ మన గురించి చెప్తే, సుత్తి లానూ తింటున్నట్టూ అనిపిస్తుంది .

    రిప్లయితొలగించండి
  4. Vivaksha intlo nundi start avuthundi .anthenduku by birth itself, bhinnathvamlo ekathvam gurinchi goppa ga cheppukune bharathiya samajam lo adi mari ekkuva, gender , caste, colour, economic, educational, political inequalities and prejudices are omnipresent. Change should begin from individual and his thought process, followed by home as a miniature society

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూర్తిగా ఏకీభవిస్తాను. వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. అందుకే నీతులు బోధించే పనిని పూర్తిగా స్కూళ్ళకి వదిలి పెట్టాలి. లేకపోతే ఇలానే ఇంటికొక నీతి వాచకం చదివి సమాజంలో order కరువవుతుంది. ప్రేమ, ఆత్మీయత, emotional support అందించటానికి పరిమితం అవ్వాలి తప్ప ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే స్థాయికి కుటుంబాలు ఉండకూడదు.

      తొలగించండి
    2. ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే స్థాయికి కుటుంబాలు ఉండకూడదు.
      @ Bhanu kiran Garu,

      ఒకప్పుడు ఇంటి పెద్దలు అన్నిటినీ శాసించేవారు. ఇపుడు ఆర్ధిక స్వేచ్చ లభించాక ఎవరైనా శాసిస్తుంటే వినడం లేదు.కుటుంబంలోని పరిస్థితులే సమాజంలో కూడా ఉంటాయి కదా ?
      శాసించే వారు లేకపోతే భయభక్తులు కొరవడి క్రమశిక్షణ లోపిస్తుంది.దీనికి పరిష్కారం సూచించండి.

      తొలగించండి
  5. ముందుగా "ముందు మాటే" ఎంతో బాగుంది.మరిన్ని పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాను. నల్ల జాతీయుల గురించి మీరు చెప్పినది నిజమైనా తెలంగాణా వారిది, పాకిస్థాన్ వారిదీ అదే పరిస్థితి కదా ? మన భారతీయులేమైనా ఉదారులా ? ఎక్కడికెళ్ళినా భారతీయులే, తెలంగాణా వారి పేరు ఎత్తినా పాకిస్థాన్ వారి పేరు ఎత్తినా తిట్టడం ఇక్కడ బ్లాగుల్లో కూడా సర్వ సామాన్యం !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. > తెలంగాణా వారి పేరు ఎత్తినా పాకిస్థాన్ వారి పేరు ఎత్తినా తిట్టడం ఇక్కడ బ్లాగుల్లో కూడా సర్వ సామాన్యం !
      మీరు కొంచెం‌ జాగర్తగా చూసి ఉంటే, తెలంగాణావారే సమయం సందర్భం కూడా చూడకుండా సందు దొరికిన చోటల్లా ఆంధ్రావారిమీద అవాకులూ చెవాకులూ అనటం గమనించి ఉండేవారు. కొందరు డీసెన్సీ ముసుగేసుకొని కొందరైతే ఏమూసుగూ లేకుండానూ వీలైన చోట తిట్లూ వీలుకానప్పుడు హేళనలూ చేయటం మీ దృష్టికి వస్తుంది. గొట్టిముక్లను గమనించండి. ఇంకా అనేకులు తిట్ల రాయుళ్ళనీ గమనించండి. అదేమీ‌ కాదని తెలంగాణావాళ్ళని ఎవరో తిడుతున్నారని అపోహపడకండి. కొంపదీసి మీరు ఈరతెలంగాణావాదులైతే మీకు ప్రపంచం అలా కనిపించటాన్ని తప్పుపట్టను లెండి.

      తొలగించండి
  6. మనిషి తనని తన పుట్టుకకు కారణమైన కుటుంబంతో మాత్రమే identify చేసుకోక సమస్థ మానవ చరిత్రకి కొనసాగింపుగా చుసికొన్నట్టైతే చరిత్రలో అన్యాయానికి, వివక్షకి గురైన జాతులు లేదా వర్గాల పట్ల సహజమైన సానుభూతి కలుగుతుంది.

    మనుషుల్లో వివక్షపూరిత భావాలను తొలగించే పనిని సమాజం మూకుమ్మడిగా పూనుకొని ప్రయత్నంగా నిర్వహించాలి.

    వివక్ష అనేది కూడా మెదడులో కలిగే ఒక మలినమైన ఆలోచనయనీ - అప్రయత్నంగానైనా అలాంటి ఆలోచన మెదడులో కలిగితే దాన్ని psychosis(మానసిక రుగ్మత)గా పరిగణించి ఆ మనిషికి వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేసే స్థాయికి మానవ సమాజాలు ఎదగాలి.

    Well written post....waiting for the next parts.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, నీహారిక గారు! మీ బ్లాగు చూస్తున్నాను..

      తొలగించండి