27, జూన్ 2014, శుక్రవారం

అనువాదాలు - అపార్థాలు - 4

1. సినిమా పాటలు గురించి ప్రస్తావించటం మానుకోవలింక నేను. నిజానికి బ్లాగ్ రాయాలనుకున్న కొత్తలో అసలు సినిమా సంబందమే లేని అంశాలు మాత్రమే మాట్లాడాలని ఒక నియమం విదించుకున్నాను. సినిమా వ్యతిరేకత అనే foundation గెట్టిగా పూసుకుంటే intellectual makeup గట్టిగా ఒత్తుకోవచ్చు. నేను కూడా అదే చెయ్యదలిచాను, అదే చెయ్యాలి, ఇప్పటికే చేసుండాల్సింది. కానైతే పూర్తిగా తీసిపారేసే సాహిత్యం మాత్రమే ఉండి ఉంటే సినిమా సాహిత్యాన్ని అసలు ముట్టుకోనే వాడినే కాను. నన్ను ఎంతో ప్రభావితం చేసిన కొందరు మహానుభావులు సినిమా వేదిక మీద నిలబడి పలు భాషల్లో మాట్లాట్టం, వాళ్ళ గురించి చర్చించే సందర్భంలో నేను తెలుగు భాషకి సంబంధించి కొంత సద్విమర్శ చేసే అవకాశం కల్పించుకోవటం --  ఇవన్ని కారణాలు అయుండొచ్చు, నేను సినిమా సాహిత్యం ప్రక్రియని గురించి మాట్లాడకుండా దాటివేయటం కుదరలేదు.

2. ఇక పొతే వాలి¹ గారు రాసిన 'కదల్ దేశం' అనే తమిళ సినిమాలోని ఒక పాటని ఒకరి కోరిక మేరకు తెలుగిస్తున్నాను. ఇది నా కోరికేం కాదు. నేను ప్రేమ కవిని కాను, నాకు దీని ద్వార చెప్పవలసింది ఏమీ లేదు. కాకపోతే తమిళ పదాలను ప్రయత్నంగా కావాలని verbatim తర్జుమా చేస్తున్నాను. శ్రద్ధగా చదవగలిగితే బోల్డన్ని తమిళ పదాలునూ ప్రయోగాలనూ నేర్చుకోగలరు.




అన్బే.. 
ఎన్నై కాణవిల్లైయే నేట్రోడు.. 
ఎంగుమ్ తేడి పార్క్కిరేన్ గాట్ట్రోడు .. 
ఉయిర్ ఓడి పోనదో ఉన్నోడు .. 
అన్బే.. 
నాన్ నిళలిల్లాదవన్ తెరియాద?
ఎన్ నిళల్ నీయేన పురియాద?
ఉడల్ నిళలై-చ్చేరవే ముడియాద?
అన్బే..?

ప్రియా.. 
నన్ను చూడలేదు నిన్నటి తోటి .. 
ఎల్ల చోట్ల వెతికి చూస్తున్నాను గాలితోటి  .. 
ఊపిరి పారిపోయిందేమో నీ తోటి.. 
ప్రియా.. 
నేను నీడ లేనివాడిని తెలియదా?
నా నీడ నువ్వేనని నీకు అర్థం కాదా? 
దేహం తన నీడని  చేరుకొనుట వీలేకాదా?
ప్రియా..?

నడైపోడుం పూగాట్ట్రే పూగాట్ట్రే.. 
వా వా 
ఎన్ వాసల్ దాన్! 
వన్దాల్ వాళ్వేనే నాన్. 

నడిచిపోతున్న పూగాలి (పూ సుగంధం కలిగిన గాలి)
రా, రా.. 
నా వాకిలే ఇది!
వస్తే.. బ్రతికెదనే నేను. 

ఆగారం ఇల్లామల్ నాన్ వాళక్ కూడుమ్ 
అన్బే ఉన్ పేరైచ్ చిన్దిత్తాల్!
తీ కుచ్చి ఇల్లామల్ తీ మూట్ట కూడుమ్ 
కణ్ణే నమ్  కణ్గల్ చందిత్తాల్!
నాన్ ఎండ్రు చొన్నాలే నాన్ అల్ల నీదాన్.. 
నీ ఇన్ఱి వాళ్ దాలే నీర్ కూడా తీ దాన్.. 
ఉన్ శ్వాచక్ కాట్రిల్ వాళ్వేన్ నాన్..!
(ఎన్నై కాణవిల్లైయే నేట్రోడు)

ఆకారం లేకున్నా నేను జీవించగలను
ప్రియ నీ పేరుని స్మరిస్తూ!
అగ్గి పుల్ల లేకున్నా నిప్పు అంటించ వచ్చును.. 
సఖి నీ చూపు నా చూపుతో కలవగా!
'నేను' అని చెప్తే అది 'నేను' కాదు 'నువ్వే'.. 
నువు లేక జీవిస్తే నీరు కూడా నిప్పే 
నీ శ్వాస గాలిలో బ్రతుకున్నాను నేను..!
(నన్ను చూడలేదు నిన్నటి తోటి ..)


నిమిషంగల్ ఒవ్వొండ్రు వరుషంగల్ ఆగుమ్ 
నీ ఎన్నై నీంగిచ్ చెన్-ఱాలే !
వరుషంగల్ ఒవ్వొండ్రు నిమిషంగల్ ఆగుమ్
నీ ఎంతన్ పక్కం నిణ్-ఱాలే !
మెయ్-యాగ నీ ఎన్నై విరుమ్బాద పొదుమ్ 
పొయ్ ఒన్ఱు చొల్ కణ్ణే ఎన్ జీవం వాళుమ్ 
నిజమ్ ఉన్తన్ కాదల్ ఎండ్రాల్!
(ఎన్నై కాణవిల్లైయే నేట్రోడు..)


నిముషాలు ఒకొక్కటి సంవత్సరాలు అవును
నువ్వు నన్ను విడిచి వెళ్తేనే!
సంవత్సరాలు ఒకొక్కటి నిముషాలు అవును
నువ్వు నా పక్కన నిల్చుంటే!
నిజంగా నువు నన్ను ఇష్టపడకపో సరే
అబద్ధం అయినా ఒకటి చెప్పు సఖి నా ప్రాణం నిలుస్తుంది.. 
నిజం నీకు అంత ప్రియమైనది అయితే!
(నన్ను చూడలేదు నిన్నటి తోటి .. )


1: ఈ పాట రాసేప్పటికి వాలి వారి వయసు 66 ఏళ్ళు ఉండటం విశేషం.

2 కామెంట్‌లు:

  1. తమిళం రాదు కానీ మీ అనువాదం బావుం(నట్టే ఉం)దండి..:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిప్రాయానికి నేను కూడా సంతోషిస్తు(నట్టే)ఉన్నాను! :)

      తొలగించండి